ఆచార్య చాణక్యుని విధానాలు జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితంలో విజయం సాధించాలన్నా, ధనవంతులు కావాలన్నా, కష్టాల నుంచి బయటపడాలన్నా, ఆచార్య చాణక్యుడు చెప్పిన విధానాలు నేటికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మూర్ఖునితో జ్ఞానం గురించి మాట్లాడటం మూర్ఖులు, ఇతరులను అర్థం చేసుకోలేని వారితో జ్ఞానం గురించి మాట్లాడకూడదు. తెలివితక్కువవారితో జ్ఞానం గురించి మాట్లాడడితే మనం సమయాన్ని వృథా చేసుకున్నవారం అవుతాం.
ఎటువంటి కారణం లేకుండా చర్చ పెరుగుతుంది, ఎందుకంటే అలాంటివారు ఎవరి మాటా వినరు. అందుకే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం వల్ల మనం ఆపదల్లో చిక్కుకోకుండా ఉంటాం.
2. పేదరికం తొలగిపోయేందుకు దారిద్ర్యం చుట్టుముట్టకూడదనుకుంటే దానం చేయడం ఉత్తమ మార్గమని ఆచార్య చాణక్య తెలిపారు. తన శక్తి మేరకు ఎప్పటికప్పుడు దానం చేస్తూనే ఉండాలి. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి పుణ్యాన్ని పొందుతాడు. పాపాలను కడిగేసుకున్నవారవుతారు.
3. వినయంగా ప్రవర్తించండి ఒక వ్యక్తి తన చర్యల కారణంగానే సుఖం లేదా దుఃఖాన్ని పొందుతాడని చెబుతుంటారు. అందుకే భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలకు ఎదురుకాకూడదనుకుంటే అహంకారంతో ప్రవర్తించకూడదు. మనం ఎప్పుడూ అందరితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి.
4. జ్ఞానానికి ప్రాధాన్యత మీరు జీవితంలో వివేకవంతులుగా మెలగాలంటే ముందుగా జ్ఞానవంతులుగా మారండి. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి. జ్ఞానం కలిగిన వ్యక్తి తన కుటుంబంలోనే కాకుండా బయట కూడా గౌరవాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి కూడా చాలా వేగంగా అన్నివిధాలా అభివృద్ధి చెందుతాడు.
5. భగవంతునిపై భక్తి భగవంతుని పట్ల మనకు ఉండే భక్తి శక్తిని ఇస్తుంది. మన జీవితంలో భగవంతుని భక్తికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది మనకు విజయాన్ని ఇస్తుంది. కఠిన సమయాల్లో మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే మనకు భగవంతునిపై విశ్వాసం, భక్తి రెండూ ఉండాలి. భక్తితో పాత జన్మల దుష్కర్మలను తొలగించుకోవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు.
0 Comments:
Post a Comment