Nutmeg In Telugu :మతిమరుపు అనేది ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనపడేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30 నుంచి 40 ఏళ్లు వచ్చేసరికి మతిమరుపు వచ్చేస్తోంది.
అయితే ఆ విషయాన్ని గ్రహించలేక పోతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటం వలన అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి. .
దానితో పాటు మెదడు పనితీరు మందగిస్తుంది. మతిమరుపు సమస్యను ముందుగా గుర్తిస్తే ఆ సమస్య నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.
కొన్ని ఆహారాలను తీసుకుంటే మతిమరుపును తగ్గించుకోవచ్చు. వాటిల్లో జాజికాయ ఒకటి. జాజికాయను పురాతన కాలం నుండి వంటల్లో మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం.
మతిమరుపును తగ్గించటానికి జాజికాయ బాగా సహాయపడుతుంది.
అయితే జాజికాయను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పావు స్పూను జాజికాయ పొడి కలుపుకుని తాగాలి.
లేదా జాజికాయ పొడి లో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.జాజికాయలో ఉండే మినిస్టిసిన్ అనే పదార్థం మెదడు పని తీరును మెరుగు పరిచి మతిమరుపు సమస్యను దూరం చేస్తుంది.
అదే సమయంలో అల్జీమర్స్ తాలూకు లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
0 Comments:
Post a Comment