ఒక లక్ష రూపాయల బడ్జెట్‌తో ఈ దేశాల్లో తిరగొచ్చు
విదేశాలకు వెళ్లాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? తక్కువ మొత్తంతో విదేశాలు చుట్టువచ్చే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు లక్ష రూపాయలతో తిరిగా రాగలిగే దేశాలు కొన్ని ఉన్నాయి.
ఈ మొత్తంలోనే ఆహారం మరియు వసతికి విమాన ఖర్చు కలిసివుంది. నేపాల్ హిమాలయాలలోని ఎత్తైన శిఖరాలు, ఆకర్షణీయమైన మఠాలు, నదులు నేపాల్‌ను అందమైన దేశంగా మార్చాయి. మీరు ఒక నెల ముందుగానే నేపాల్‌కు ఫ్లైట్ బుక్ చేసుకుంటే, నేపాల్‌ను మీరనుకున్న బడ్జెట్ అంటే లక్ష రూపాయలలో తిరిగి రావచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) టెక్నాలజీ ఆవిష్కరణలతో పాటు కొనుగోలుదారులకు అద్భుతమైన గమ్యస్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతదేశం నుండి యుఎఇకి ప్రయాణ ఖర్చు అంచనా ప్రకారం సుమారు 15 నుండి 16 వేల రూపాయల వరకూ అవుతుంది. అయితే విమాన టిక్కెట్ ధర అనేది మీ ప్రయాణ సమయంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ హోటల్లో ఒక రాత్రి బసకు దాదాపు 2 నుంచి 3 వేల రూపాయల వరకు అద్దె ఉంటుంది.
మలేషియా బీచ్‌ల అందాలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య విశ్రాంతిగా గడిపే వారికి మలేషియా గొప్ప గమ్యస్థానం. భారతదేశం నుండి మలేషియాకు ఎయిర్ రౌండ్ ట్రిప్ టిక్కెట్ ధర సుమారు 23 వేల రూపాయలు. అయితే మీరు దీన్ని మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చాలా సౌకర్యవంతంగా 500-600 రూపాయలకు గెస్ట్‌హౌస్‌లు లేదా డార్మిటరీ గదులను పొందే అవకాశం ఉంది. శ్రీలంక సముద్రపు నీటిలో మీ పాదాలను ముంచి మత్స్య రుచిని ఆస్వాదించాలనే ఆసక్తి మీకు ఉంటే, శ్రీలంక కంటే మెరుగైన ప్రదేశం మరొకటి ఉండదు. భారతదేశం నుండి శ్రీలంక పర్యటన కూడా దాదాపు లక్ష రూపాయలతో అవుతుంది. ఇది హనీమూన్లకు చక్కని ప్రదేశం. భూటాన్ భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అని అంటారు. దీని అందం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఢిల్లీ నుండి భూటాన్‌కు రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్ 10 వేలకు సులభంగా అందుబాటులో ఉంది. ఇక్కడ బస చేసేందుకు 500-700 రూపాయలకే గెస్ట్ హౌస్‌లు కూడా లభిస్తాయి. (ఇవి కొంతకాలం క్రితం నాటి అంచనాలు.. ఇప్పుడు కాస్త మార్పులు ఉండవచ్చు)
0 Comments:
Post a Comment