Face Swollen After Wake Up: ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటుందా? ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు.
మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారు వేసుకునే మందులతో కొందరికి నిద్ర లేవగానే ముఖం ఉబ్బొచ్చు
Face Swollen After Wake Up: కొన్నిసార్లు ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటుంది. ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు.
మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారు వేసుకునే మందులతో కొందరికి నిద్ర లేవగానే ముఖం ఉబ్బొచ్చు. ఇతరత్రా సమస్యల కోసం స్టిరాయిడ్లు వాడేవారిలోనూ ఇలా కనిపిస్తుంటుంది.
హైపోథైరాయిడిజమ్, కుషింగ్ సిండ్రోమ్ వంటి జబ్బులూ దీనికి కారణం కావచ్చు. ముక్కు చుట్టుపక్కల గాలిగదుల్లోని గోడల వాపు (సైనసైటిస్) గలవారిలోనూ ముఖం ఉబ్బినట్టు కనిపించొచ్చు.
కొన్నిసార్లు అలర్జీలు, కీటకాలు కుట్టటం వంటివీ తాత్కాలికంగా దీనికి దోహదం చేయొచ్చు.
కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముఖం ఉబ్బినట్టు అనిపిస్తే డాక్టర్ను సంప్రదించి, తగు కారణాన్ని గుర్తించి జాగ్రత్త పడటం మంచిది. వైద్యుని సూచనలతో పాటు వ్యాయామం తప్పనిసరి.
వారంలో కనీసం మూడుసార్లు బరువులెత్తే వ్యాయామాలను చేయాలి. చిన్న వాటితో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి.
తక్కువ కేలరీలుండే కూరగాయలను రోజువారీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.
0 Comments:
Post a Comment