ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.
జూన్ లో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. నగదు బదిలీపై అపోహలు సృష్టిస్తున్నారని, నగదు బదిలీ ప్రారంభించాలని 2017లోనే కేంద్రం సూచించిందని మంత్రి కారుమూరి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఇష్టం ఉన్న వాళ్లకి నగదు బదిలీ చేస్తామని, ఇష్టం లేని వాళ్లకి బియ్యం ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రజల ఇష్టంతోనే పైలట్ ప్రాజెక్టుగా రెండు, మూడు మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని అన్నారు. కార్డులు తొలగిస్తామని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవ్వరి కార్డులు తొలగించం అని క్లారిటీ ఇచ్చారు. జూన్లో కూడా కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇంకా రేటు నిర్ణయించలేదని, రూ.16 రూపాయలంటూ కొన్ని టీవీ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
0 Comments:
Post a Comment