✍️ఉడకని అన్నం ఎలా తినేది?
♦తంబళ్లపల్లెలో రోడ్డెక్కిన విద్యార్థులు.. ఖాళీ కంచాలతో నిరసన
🌻తంబళ్లపల్లె, ఏప్రిల్ 18:
మధ్యాహ్న భోజనంలో భాగంగా ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు ఖాళీ కంచాలతో పాఠశాల ముందు రోడ్డుపై బైరా యించి ధర్నా చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 311 మంది విద్యార్థులు చదువు తుండగా సోమవారం పాఠశాలకు 298 మంది హాజరయ్యారు. వీరికి మధ్యాహ్న భోజనంలో భాగంగా సోమవారం అన్నం, ఉళ్లగడ్డ సాంబారు, రసం వడ్డించారు. అయితే అన్నం సరిగా ఉడకలేదని.. మెతుకులు బియ్యం బియ్యంగా ఉన్నాయని, ముద్ద దిగడంలేదని విద్యార్థులు వంట నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. అయితే వారు.. తింటే తినండి... లేకపోతే పోండి.. అని దురుసుగా సమాధానమిచ్చారు. ఆగ్రహించిన విద్యార్థులు ఖాళీ కంచాలతో పాఠశాల ముందు రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. పోలీసులు అక్క డికి వచ్చి విద్యార్థులతో మాట్లాడి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లి పరిష్కరిస్తానని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఎంఈవో త్యాగరాజు పాఠశాలకు వచ్చి వండిన భోజనాన్ని పరిశీలించి, బాగోలేకపోవ డంతో వంట నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
0 Comments:
Post a Comment