ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం పలు ఓటీటీ బండిల్ ప్లాన్స్‌ను అందిస్తోంది. కాగా ఆయా ఓటీటీ బండిల్ ప్లాన్స్‌ను సవరిస్తూ ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది.
వ్యాలిడిటీ తగ్గింపు..!
భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు అందించే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ వ్యాలిడిటీలో మార్పులు చేసింది. సదరు ఓటీటీ బండిల్ ప్లాన్స్‌పై ..ఇంతకుముందు, ఎయిర్‌టెల్ దాని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సేవలను అందించింది. కానీ ఇప్పుడు, ఆ సబ్‌స్క్రిప్షన్ చెల్లుబాటు ఆరు నెలలకు తగ్గించింది. ఇక ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు.
ఎయిర్‌టెల్ వినియోగదారులకు కోసం అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ వంటి ఓటీటీ సేవలను ఎయిర్‌టెల్ ఆయా ప్లాన్లపై ఉచితంగా యూజర్లకు అందిస్తోంది. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సేవలను ఎయిర్‌టెల్ మొత్తం ఐదు పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని సవరిస్తూ ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ రూ. 499, రూ. 999, రూ. 1199, రూ. 1599 ప్లాన్స్‌తో ఇప్పుడు కేవలం ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో రానుంది. గతంలో ఈ ప్లాన్స్‌పై వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్ అందించేది.
0 Comments:
Post a Comment