పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఎముకలు గుల్లబారే ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇందుకు కారణం ప్రతి నెలా నెలసరి రూపంలో రక్తంతో పాటు, పిల్లలకు పాలివ్వడం ద్వారా పాలతో పాటు క్యాల్షియంను కోల్పోతూ ఉండడమే!
కాబట్టి కోల్పోతున్న క్యాల్షియాన్ని ఎప్పటికప్పుడు ఆహారంతో భర్తీ చేస్తూ ఉండాలి.
ఇందుకోసం పాలిచ్చే తల్లులు క్యాల్షియం సమృద్ధిగా ఉండే పాలు, పెరుగు, నువ్వులు, ఆకుకూరలు లాంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటూ కోల్పోతున్న క్యాల్షియంను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి.
లేకపోతే నడి వయసులోనే ఎముకలు గుల్లబారిపోయే ప్రమాదం ఉంటుంది.
కొన్ని వ్యాధుల్లో....
కేన్సర్, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (తరచుగా విరేచనాలు), సిలియాక్ డిసీజ్, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు, లూపస్, చర్మపు కేన్సర్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్.. ఈ వ్యాధుల్లో క్యాల్షియం నష్టం ఎక్కువ.
కాబట్టి అందుకు తగ్గట్టు ఎక్కువ మోతాదుల్లో క్యాల్షియం తీసుకుంటూ ఉండాలి.
అధిక బరువు
మోయగలిగినంత భారాన్ని మించితే ఎముకలు క్రమేపీ అరిగిపోతాయి. అలాగని అవసరానికంటే తక్కువ బరువు ఉన్నా ఎముకలు బలహీనపడతాయి.
కాబట్టి సరైన శరీర బరువు కలిగి ఉండాలి. అలాగే ఆహారం ద్వారా అందే క్యాల్షియంను శరీరం శోషణ చేసుకోవాలంటే, విటమిన్ సి అవసరం.
కాబట్టి పుల్లని పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా సి విటమిన్ అందేలా చూసుకోవాలి.
విటమిన్ డి కూడా ఎముకల దృఢత్వానికి అవసరం. కాబట్టి వైద్యుల సూచన మేరకు విటమిన్ డి సప్లిమెంట్లు వాడుకోవాలి.
0 Comments:
Post a Comment