🔳కామన్ ఎంట్రెన్స్ ఆధారంగానే డిగ్రీ అడ్మిషన్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కొత్తగా ప్రవేశపెట్టిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ స్కోరు ఆధారంగానే దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలన్నీ డిగ్రీ అడ్మిషన్లను చేపట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. అవసరమైతే యూనివర్సిటీలు ఇతర అర్హతలను కూడా రూపొందించుకోవచ్చని, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ) స్కోరు మాత్రం తప్పనిసరని స్పష్టం చేసింది. అలాగే.. ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యేక కోర్సులకు అదనపు అర్హతలను నిర్ణయించుకోవచ్చని ఆయా యూనివర్సిటీల వైస్ చాన్సలర్లకు యూజీసీ లేఖ రాసింది.
0 Comments:
Post a Comment