✍️బకాయి బిల్లుల కోసం ఎదురుచూపులు!
♦సీఎఫ్‌ఎంఎస్‌లోకి వెళ్లటం లేదన్న ఉద్యోగులు
🌻ఈనాడు-అమరావతి
ఉద్యోగులకు చెందిన పలు రకాల అరియర్ బిల్లులు పెట్టుకుంటున్నా ఆన్‌లైన్‌లో కనిపించటం లేదు. అవి క్లెయిమ్ అయ్యాయా లేవా అన్నది తెలియకుండా ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 6 నుంచి ‘పేరోల్ రిజిస్టర్’ సైట్‌లో ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బకాయి బిల్లులు ప్రతిపాదించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఉద్యోగులకు 2020లో జనవరి, ఫిబ్రవరిలో నమోదు చేసిన డీఏ బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. ఆర్థిక సంవత్సరం ముగియటంతో తిరిగి వాటిని మరోసారి ప్రతిపాదించాలని సూచించటంతో ఉద్యోగులు ఆ బిల్లులు పెడుతున్నారు. పేరోల్ రిజిస్టర్‌లో నమోదుచేసిన వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లోకి వెళ్లాలి. అప్పుడే ఆ బిల్లులు ఫోర్స్‌లో ఉంటాయి. అయితే అసలు సీఎఫ్‌ఎంఎస్ సైట్లోకి ఆ వివరాలు వెళ్లటం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. నిధులు లేవని వస్తోందని, దీనిపై ఖజానా అధికారులను అడిగినా స్పష్టత ఉండటం లేదు. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన ఉద్యోగులు గత వారం రోజులకు పై నుంచి అరియర్ బిల్లులు ప్రతిపాదించి ఆమేరకు వాటిని క్లెయిమ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాహన, కరవు భత్యం, జీతాల బిల్లుల్లో తేడాలు ఉన్నా, గతంలో వివిధ కారణాలతో జీతాలు బిల్లులు పెట్టుకోకపోయినా, ఆర్జిత సెలవుల బిల్లులు ఇలా అనేకం ఉంటాయి. ఇవన్నీ కంప్యూటర్ల ముందు కూర్చొని గంటల తరబడి నమోదు చేస్తే చివరకు అవి పే రోల్ రిజిస్టర్ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లకపోవటం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అసలు తమ బిల్లులు సైట్‌లోకి వచ్చాయా లేక తిరిగి మరోసారి ప్రతిపాదించాలా అనేది కూడా ఎవరూ చెప్పటం లేదని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు మల్లేశ్వరరావు తెలిపారు. వాటి నమోదుకు అవకాశం కల్పించి ఉపయోగం ఏమిటి? ఆబిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లోకి వెళ్లకపోతే బిల్లులుగా మారవని సీఎఫ్‌ఎంఎస్‌లోకి వస్తే వాటికి టోకెన్ నంబరు జనరేట్ అవుతుంది. అది తమ చరవాణికి వస్తుంది. కానీ ఇప్పటి వరకు అలా టోకెన్ నంబర్లు అయి వచ్చిన ఉద్యోగులు ఎవరూ లేరని సగటున ప్రతి ఉద్యోగికి ఏదో ఒకటి అరియర్ బిల్లు ఉందన్నారు.
0 Comments:
Post a Comment