Black Pepper Benefits: ప్రతిరోజూ ఆహారంలో మిరియాల వినియోగం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. దీన్ని వల్ల స్థూలకాయాన్ని తగ్గించడం సహా కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో నల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి.
అంతే కాకుండా నల్ల మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ తగ్గుముఖం
శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో నల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు గుండె పోటు ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.
బరువు తగ్గేందుకు సహకారం
మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటి వారు రోజూ తినే ఆహారంలో నల్ల మిరియాల పొడిని తీసుకుంటే మేలు జరుగుతుంది. కావాలంటే మిరియాల పొడిని టీలో కూడా కలుపుకొని తాగవచ్చు.
జలుబు, దగ్గుకు నివారణ
నల్ల మిరియాల పొడి.. జలుబు, దగ్గు నివారణలో చాలా ఉపయోగంగా మారుతాయి. నల్ల మిరియాల్లో శరీరానికి మేలు చేసే అనేక మూలకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో పెప్పరైన్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఉంది. ఇది జలుబు, దగ్గు వంటి వ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం..
అంతే కాకుండా.. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి నల్ల మిరియాలు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్.. కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికల ఆధారంగా సేకరించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
0 Comments:
Post a Comment