టీచర్లపై బైండోవర్లు అధికార దుర్వినియోగమే
♦ఎపి పౌరహక్కుల సంఘం
🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
ఉపాధ్యాయులు తమ సమస్యలపై నిరసన తెలిపినందుకు బైండోవర్ కేసులు పెట్టడం, నోటీసులు జారీ చేయడం అధికార దుర్వినియోగమేనని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఎపిసిఎల్ఎ) పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేష్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం, నోటీసులు జారీ చేయడం ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శమని తెలిపారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగంతోపాటు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు. ఇటువంటి నిర్బంధ చర్యలను ఎపిసిఎల్ఎ చట్టపరంగా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వం దాడి చేయడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
0 Comments:
Post a Comment