Bank Loan | CIBIL Score: త్వరగా రుణం మంజూరు కావాలంటే.. సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో తెలుసా..?
ఎవరికైనా రుణం(Loan) ఇవ్వాలంటే..
తీసుకునే వ్యక్తికి తిరిగి చెల్లించే స్తోమత ఉందో లేదో చూస్తారు. ఇక బ్యాంకులు(Banks), ఆర్థిక సంస్థల విషయానికి వస్తే రుణగ్రహీత CIBIL స్కోర్‌ను పరిశీలించి లోన్లు మంజూరు చేస్తాయి. CIBIL స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే రుణం ఈజీగా(Easy) లభిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణ ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణగ్రహీత మంచి CIBIL స్కోర్(Score) సాధిస్తేనే బ్యాంకులు రుణాలు(Bank Loans) లేదా క్రెడిట్ కార్డులను(Credit Cards) జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు బ్యాంకు సిబ్బంది రుణగ్రహీత సిబిల్ రిపోర్ట్‌ను తయారు చేస్తారు. ఇందులో వ్యక్తి క్రెడిట్ వివరాలు ఉంటాయి. ఈ నివేదికను పరిశీలించిన తరువాత బ్యాంకులు రుణగ్రహీత తిరిగి చెల్లింపులకు సంబంధించిన క్రమశిక్షణను నిర్ధారిస్తాయి. వ్యక్తి క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలా వద్దా? అని నిర్ధారించుకుంటాయి.
* మెరుగైన CIBIL స్కోర్‌తో ఉపయోగాలు ఇలా
చౌక రుణాలు: రుణ గ్రహీతల రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. రుణగ్రహీత CIBIL స్కోర్ బాగుంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును అందించవచ్చు.
త్వరగా లోన్ అప్రూవల్: ఎవరైతే మంచి క్రెడిట్ స్కోర్ సాధిస్తారో లోన్ అప్రూవల్‌లో ఎటువంటి అంతరాయాలు ఉండవు. త్వరగా ఆమోదముద్ర లభిస్తుంది. ఆర్థిక సంస్థలు మంచి CIBIL స్కోర్ ఉన్నవారికి సులభంగా రుణాలను మంజూరు చేస్తాయి.
అధిక క్రెడిట్ పరిమితులు: బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడానికి రుణగ్రహీతకు మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. ఎందుకంటే ఇందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీరు మంచి CIBIL స్కోర్‌ని కలిగి ఉంటే తక్కువ స్కోర్ ఉన్నవారితో పోలిస్తే మీకు ఎక్కువ మొత్తంలో లోన్ లేదా ఎక్కువ క్రెడిట్ పరిమితిని బ్యాంకులు అందించవచ్చు.
ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లు: మంచి CIBIL స్కోర్‌ని కలిగి ఉంటే బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లు లేదా క్రెడిట్ కార్డ్‌లను అందించే అవకాశం ఉంది. తద్వారా వ్యక్తిగత రుణం పొందడానికి ఇది రాజమార్గంలా పనిచేస్తుంది.
మరిన్ని ప్రయోజనాలతో కార్డులు: క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు కొన్ని ప్రయోజనాలు, రివార్డ్‌లతో వస్తాయి. అయితే మెరుగైన క్రెడిట్ రీపేమెంట్ హిస్టరీ, మంచి CIBIL స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు మరిన్ని ప్రయోజనాలు, రివార్డులను అందిస్తాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2017లో దేశంలోని అన్ని క్రెడిట్ బ్యూరోలు ప్రతి క్యాలెండర్ ఇయర్‌కు ఒక ఉచిత వివరణాత్మక క్రెడిట్ నివేదికను అందించడాన్ని తప్పనిసరి చేసింది. ఇది CIBIL అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
PWC నివేదిక ప్రకారం దేశంలో క్రెడిట్ కార్డుల జారీ గత నాలుగేళ్లలో 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో గణనీయంగా వృద్ధి సాధించింది. క్రెడిట్ కార్డ్ హోల్డర్ల సంఖ్య మార్చి 2017లో 29 మిలియన్ల ఉంటే ఈ సంఖ్య మార్చి 2021 నాటికి 62 మిలియన్లకు పెరిగింది. ఇది 2019, 2020లో వరుసగా 26, 23 శాతం పెరిగింది. తాజా RBI డేటా ప్రకారం.. దేశంలో క్రెడిట్ వృద్ధిలో ప్రధానంగా రిటైల్ రుణాల వాటా అధిక ఉంది. రెండో స్థానంలో పారిశ్రామిక రుణాలు నిలిచాయి.
0 Comments:
Post a Comment