AP New Districts: ఏపీలో చిన్న జిల్లా ఇదే..
Andhrapradesh: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి.
తక్కువ విస్తీర్ణం (3,659 చదరపు కిలోమీటర్లు), తక్కువ జనాభా (9.253 లక్షలు)తో పార్వతీపురం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి.
ఒకే ఒక అర్బన్ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా మాత్రం 19.595 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది.
0 Comments:
Post a Comment