✍️ఇదేంది నాయకా!
♦ఎక్కడి దరువు అక్కడేనా?
♦ప్రభుత్వ పెద్దల ముందు ఒకలా..ఉద్యోగుల ముందు మరో విధంగా
♦ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ తీరుపై విమర్శలు
♦సంఘం ఎన్నికల స్టంట్ అంటున్న ఉద్యోగులు
🌻అమరావతి/విజయవాడ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పెద్దల ముందు వారికి అనుకూలంగా మాట్లాడతారు. ఉద్యోగుల ఎదుటకు వస్తే వారికి అనుగుణంగా మాట మార్చేస్తారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల ప్రయోజనాలు పట్టకుండా ఎక్కడి దరువు అక్కడ వేయడమే ఆయన వైఖరి అని పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలో మంత్రుల కమిటీతో చర్చల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలకు, బుధవారం మాట్లాడిన మాటలకు పొంతన లేదంటున్నారు. త్వరలో జరగనున్న తమ సంఘం ఎన్నికల కోసమే ఈ స్టంట్ అని విమర్శిస్తున్నారు.
ఏపీజీఈఏ జేఏసీలో చేరిన ఫోర్టోబుధవారం విజయవాడలో ఏపీజీఈఏ జేఏసీలోకి రాష్ట్రంలోని 12 ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫోర్టో) చేరిక కార్యక్రమం నిర్వహించారు. నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్‌తో పాటు మరో 11 ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదికలో చేరాయి. ఫోర్టో చైర్మన్ సామల సింహాచలం, కో-చైర్మన్ హరికృష్ణ ఆధ్వర్యంలో 12 ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఒప్పంద పత్రాలను అందజేశారు. ఏపీజీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు, రాష్ట్ర ఆడిట్ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిశంకర్, ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.
♦ఫిబ్రవరి 5న అలా....‘‘ఈ రోజు ఉద్యోగులకు మంచి రోజు. తక్కువ సమయంలో మా డిమాండ్లను, మా మనసును గుర్తెరిగి మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. కొవిడ్ లేకుంటే ఉద్యోగులు ఆశించిన మేర ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉండేది. మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వడానికి, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులకు ప్రభుత్వం అంగీకరించింది. ఎటువంటి రికవరీలు చేయకుండా నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ 5ఏళ్లకు అంగీకరించింది. సీపీఎ్‌సపై మార్చి 31లోగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది గుడ్ డీల్‌గా భావిస్తున్నాం. మా బాధ, ఆవేశం పోయింది. ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చేసుకోవాలని కోరుతున్నాం. సీఎంను కలిసి స్వయంగా కృతజ్ఞత తెలుపుతాం. నాలుగు సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. సమ్మెను విరమిస్తున్నాం.’’
♦ఏప్రిల్ 20న ఇలా... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 11వ వేతన సవరణపై ఏ ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు కూడా సంతోషంగా లేడు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మధ్య అనైక్యతను ప్రభుత్వం అవకాశంగా తీసుకుని నష్టం చేకూర్చింది. ప్రభుత్వం తూతూమంత్రంగా చర్చలు జరిపింది. అంగీకరించిన వాటికీ ఇప్పటివరకు ఉత్తర్వులు ఇవ్వలేదంటే ఉద్యోగులపై ప్రభుత్వ అలసత్వం అర్థమవుతోంది. చర్చల సమయంలో విధి లేక పీఆర్సీని అంగీకరిస్తున్నామని ముఖ్యమంత్రికి చెప్పా. ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై సీఎం తన విశ్వసనీయతను కోల్పోకూడదు. మే 5న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని బట్టి చూస్తే ఉద్యోగ సంఘాలు ఐక్యతతో ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి.’’
నీ పదవి కోసం ఎంతకైనా తెగిస్తావు కదరా బోసుడికె
ReplyDelete