AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రుల రాజీనామా.. కాన్వాయ్‌ని వదిలేసి సాదాసీదాగా..
ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ ముగిసింది. కేబినెట్లో పాల్గొన్న మంత్రులు జగన్‌కు రాజీనామా లేఖలను కూడా అందించారు.
మంత్రుల లెటర్ ప్యాడ్లను తీసుకున్న ప్రోటోకాల్ అధికారులు.. వాటిపై రాజీనామా టైప్ చేశారు. మంత్రుల సంతకాలు తీసుకుని వాటిని ముఖ్యమంత్రికి అందజేశారు. ఆ తర్వాత వాటిని గవర్నర్ కార్యాలయానికి పంపడం, ఈ రాత్రికే వాటి ఆమోదం కూడా లాంఛనం కాబోతోంది. 72 కాదు.. 74. కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఏపీలో రెవిన్యూ డివిజన్లు 72 కాదు. 74. మొన్నటి జిల్లాల విభజన తర్వాత కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం, అమలాపురం రెండు డివిజన్లు ఉండేవి.
ఆ రెండింటితో పాటు ఇప్పుడు కొత్తగా కొత్తపేట డివిజన్‌ను కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఇక మొన్నటి జిల్లా విభజన తర్వాత కడప జిల్లాలోనూ బద్వేల్, కడప, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్లు ఉండగా.. తాజాగా పులివెందుల డివిజన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది. దీనితోపాటు మిలెట్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో.. డిగ్రీ కళాశాలలో 574 టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్ట్ ల భర్తీకి ఆమోదం.
జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేందుకు క్యాబినెట్ ఓకే చెప్పింది. పంచాయితి రాజ్ చట్టసవరణకు ఆమోదం తెలిపింది. ఏపి టూరిజం కార్పొరేషన్ కు రాజమండిలో 6 ఎకరాలు కేటాయింపు.
రాజమండ్రి, కర్నూలు, విజయనగరం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రభుత్వ హాస్పిటళ్లకు భూ కేటాయింపు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో పారిశ్రామిక పార్కకు 82 ఎకరాల భూ కేటాయింపు.
🌷🌷కేబినెట్ నిర్ణయాలివే..
నవరత్నాలు అమల్లో భాగంగా ‘సున్నా వడ్డీ’ పథకం మూడో ఏడాది కూడా కొనసాగించేందుకు రూ.1,259 కోట్లు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 7 మండలాలలతో, 8 మండలాలతో పులివెందులలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లా పరిషత్‌ల కాల పరిమితి, రిజర్వేషన్లు కొనసాగిస్తూ కేబినెట్ తీర్మానించింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. ఇందులో 7 టీచింగ్ పోస్టులు, 5 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. చిరు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ మిల్లెట్ మిషన్ పాలసీని 2022-23 నుంచి 2026-27 వరకు కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్‌ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ను, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యాశాఖకోసం 253 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం. ఇందులో 23 ప్రిన్సిపల్, 31 టీచింగ్ పోస్టులు, 139 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో 82 ఎకరాలు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు కోసం 84 ఎకరాల కేటాయింపు. ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
0 Comments:
Post a Comment