Ap 10th Exams: ఏపీ పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ కలకలం.. వాట్సాప్ గ్రూప్‌లలో ప్రశ్నాపత్రం..
Ap 10th Exams: ఆంధప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడం వార్త ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.
బుధవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపోసిట్ తెలుగు పేపర్ వన్ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షమైంది అని . చిత్తూరులో ఈ లీకింగ్ సంఘటన జరిగింది అని 9 గంటలకు పరీక్ష ప్రారంభమైతే 9.57కి వాట్సాప్ గ్రూప్‌లలో క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతోంది అని వదంతులు వచ్చాయి..
ఇంతకీ ఈ ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి లీకైంది. పరీక్ష ప్రారంభానికి ముందే లీక్ చేశారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అరంగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వార్తలు ప్రాధాన్యతను సంతరించుకుంది.
Andhra News: పది ప్రశ్నపత్రం లీక్ వదంతులు.. అప్రమత్తమైన అధికారులు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వదంతులొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పశ్నపత్రం లీక్ ఎక్కడ జరిగిందో తమకు తెలియదని విద్యాశాఖ అధికారులు చెప్పారు.
చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి పేపర్ లీక్ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయంపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని డీఈవో పురుషోత్తం తెలిపారు. ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ వార్తలు నమ్మొద్దని చిత్తూరు కలెక్టర్ చెప్పారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని.. చిత్తూరు జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
0 Comments:
Post a Comment