Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..
ఏపీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాల ఉన్నత, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ వెల్లడించింది.
కాగా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీకాలం పొడిగించడంపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట లభించింది. కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయరాదని పేర్కొంటూ తెలంగాణ స్టేట్ డాక్టరేట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం నాడు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
0 Comments:
Post a Comment