Andhra News: వ్యాపారి నిర్లక్ష్యం.. వాటర్ బదులు విద్యార్థి యాసిడ్ తాగేశాడు!
ఎనికెపాడు: విజయవాడలోని ఎనికెపాడులో దారుణం చోటుచేసుకుంది. వ్యాపారి నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతున్న చైతన్యకు బాగా దాహం వేసింది. ఓ షాప్‌కు వెళ్లి వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి.. పొరబాటున వాటర్ బాటిల్‌కు బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఇది గమనించని చైతన్య బాగా దాహం వేయడంతో యాసిడ్ తాగేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. చైతన్య వైద్యానికి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు విరాళాలు సేకరిస్తున్నారు.
0 Comments:
Post a Comment