Andhra News: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువల సవరణ.. ప్రభుత్వం ఆమోదం
Andhra News: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువల సవరణ.. ప్రభుత్వం ఆమోదం
అమరావతి: కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జిల్లా కేంద్రాల సమీప ప్రాంతాల్లోని భూముుల విలువను ఈ నెల 6వ తేదీ నుంచి సవరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను సవరించాల్సిందిగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 6 నుంచి కొత్త మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్కెట్ విలువలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.
0 Comments:
Post a Comment