Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 4 April 2022

Amma Odi _ అమ్మఒడి.. ఆంక్షల సుడి విద్యార్థులకు హాజరుతో లింకు అర్హత సాధించాలంటే 75శాతం ఉండాలి ఆందోళనలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. కరోనా వేళ కఠిన నిబంధనలపై ఆవేదన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనూ స్పష్టత కరువు

 అమ్మఒడి.. ఆంక్షల సుడి

విద్యార్థులకు హాజరుతో లింకు

అర్హత సాధించాలంటే 75శాతం ఉండాలి

ఆందోళనలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

కరోనా వేళ కఠిన నిబంధనలపై ఆవేదన

ప్రభుత్వ ఉత్తర్వుల్లోనూ స్పష్టత కరువు

లబ్ధిదారుల కోతే లక్ష్యంగా పథకం అమలు

సాయం ఎప్పుడు పడుతుందో మాత్రం చెప్పరు



ఒంగోలువిద్య, ఏప్రిల్‌ 3 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఒకటైన అమ్మఒడి పథకం అమలుకు ప్రభుత్వం అంక్షలు విధించింది.

గత రెండుసార్లు హాజరుతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు ఖాతాలకు అమ్మఒడి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థుల హాజరుకు లింకు పెట్టింది. విద్యార్థుల హాజరు మాన్యువల్‌లో కాకుండా యాప్‌లో నమోదైన హాజరును ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 75శాతం హాజరు ఉంటేనే అమ్మఒడికి అర్హులని ప్రకటించడంతో ఇదంతా లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నిబంధనలతో అమ్మఒడి అనర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


స్పష్టత లేని ఉత్తర్వులు

అమ్మఒడి పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత లోపించింది. విద్యార్థులలో డ్రాప్‌ అవుట్లను నివారించేందుకు నూరుశాతం మంది విద్యార్థులు రోజు తరగతులకు హాజరయ్యేలా చూసేందుకే అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం మొదటిలో ప్రకటించింది. ఈ ఏడాది హాజరు ఉన్నవారికే అమ్మఒడి సాయం అందిస్తామని అప్పట్లో ప్రకటించింది. రెండేళ్ళుగా కొవిడ్‌ కారణంగా విద్యార్థులు హాజరు శాతం పట్టించుకోకుండా అర్హులైన వారందరికీ అమ్మఒడి నిధులు అందజేశారు. తాజాగా అమ్మఒడిని విద్యార్థులు హాజరుకు ముడిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా నేపఽథ్యంలో గతేడాది ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పదోతరగతి విద్యార్థులకు రోజూ తరగతులు నిర్వహిస్తుండగా 6, 7 తరగతులకు ఒకరోజు, 8, 9 తరగతులకు రోజు మార్చి రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఈ నెల 8 నుంచి ఏప్రిల్‌ ఆఖరు వరకు హాజరును పరిగణనలోకి తీసుకుంటామని మొత్తం 130 రోజులు పనిదినాల్లో కనీసం 75 శాతం హాజరు ఉన్నవారికే అమ్మఒడి లబ్ధి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించే పాఠశాలల్లో పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వచ్చినా 75శాతం హాజరు రాదని ఏంచేయాలంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో తరగతుల నిర్వహణ విషయంలో ప్రత్యామ్నాయ చర్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

దివ్యాంగులకు ఉపశమనం

అమ్మఒడి పథకం కింద లబ్ధిపొందే దివ్యాంగులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. రెగ్యులర్‌గా పాఠశాలకు హాజరు కాలేక విలీన విద్య రిసోర్సు టీచర్ల (ఐఈఆర్‌టీ)ల ద్వారా ఇంటి వద్దే విద్యను అభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అమ్మఒడి కింద లబ్ధిపొందేందుకు ప్రభుత్వం హాజరు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు దీంతో ఇప్పటి వరకు అమ్మఒడి అందదేమోనన్న ఆందోళనలో ఉన్న దివ్యాంగుల తల్లిదండ్రులకు ఊరట లభించినట్లు అయింది.


హాజరు నమోదు ఎలా..?

పాఠశాలల్లో విద్యార్థుల హాజరును యాప్‌లో నమోదు చేయడంలో ఎలా అనే విషయంలో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని 2,981 ప్రాథమిక పాఠశాలలు, 562 ప్రాథమికోన్నత పాఠశాలలు, 917 ఉన్నత పాఠశాలలు మొత్తం 4,440 పాఠశాలల్లో 1 నుంచి 10వతరగతి వరకు మొత్తం 4,87,744 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని అనేక గ్రామాలలో ఫోన్‌ సిగ్నెల్‌ సరిగారాదు, అలాంటి చోట నెట్‌ సహాయంతో యాప్‌లలో విద్యార్థుల హాజరు నమోదు చేయడం ఎలా సాధ్యపడుతుందని ఉపాధ్యాయుల సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చినా యాప్‌లో హాజరు నమోదు కాకపోతే వారు అమ్మఒడికిఅర్హులు కారు. మొత్తం రోజులు పాఠశాలకు వచ్చినా అమ్మఒడి ఎందుకు అర్హులు కారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తామేమి సమాధానం చెప్పాలని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్దదోర్నాల ,అర్ధవీడు, బేస్తవారిపేట, సిఎ్‌స.పురం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం తదితర మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. స్థానికంగా ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం యాప్‌లో హాజరు నమోదు చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తుండడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 2019-20లో 2,76,115 మంది తల్లులకు 414.2 కోట్లు, 2020-21లో 2,82,080 మంది తల్లులకు 423.1 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది ఎంతమంది తల్లులకు అమ్మఒడి అందుతుందో వేచిచూడాల్సిందే.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top