Amazon Prime Videos: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు ముందుగానే యాక్సెస్..
Amazon Prime పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఇండివిడ్యువల్ మూవీలను(Individual Movies) రెంట్‌లో చూసుకునేలా 'పే పర్ వ్యూ' సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఈ నూతన సర్వీస్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు, నాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉండనుంది. దీని కోసం ప్రైమ్ వీడియో యాప్, వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కసారి సినిమాను చూసేందుకు యూజర్లు రూ. 69 నుంచి రూ. 499 మధ్య నిర్ణయించిన రేటుకు అనుగుణంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త సినిమాలను కొనుగోలు చేసిన తరువాత.. 30 రోజుల పాటు యూజర్లకు అద్దెకు(Rent) అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత 48 గంటల్లో యూజర్లు మూవీని చూసేయాలి. అంటే కొత్త మూవీలను యూజర్లకు త్వరగా యాక్సెస్ అందించేందుకు ఈ సరికొత్త సర్వీసును కంపెనీ ప్రారంభించింది. కొత్త మూవీలను యూజర్లు ముందే యాక్సెస్ పొందేలా రెంట్ బేసిస్‌లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంతేకాక రాబోయే రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో 40 కొత్త సినిమాలను, సిరీస్‌లను తన ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే 24 నెలల్లో తన ఒరిజినల్ సిరీస్‌ను, సినిమాలను లాంచ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసు భారత్‌తో ఐదేళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ ఏడాది ప్రైమ్ వీడియోపై రాబోతున్న వెబ్ సిరీస్‌లపై ప్రకటన చేసింది. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ వేదికలకు కీలకమైన మార్కెట్‌గా ఉంది. పే పర్ మూవీ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావటంపై ఆనందంగా ఉన్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో హెడ్ గౌరవ్ గాంధీ పేర్కొన్నారు. ఈ సర్వీసు కస్టమర్ల రీచ్‌ను, ఎంపికలను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో వచ్చే ఐదేళ్లలో తన ఇన్వెస్ట్‌మెంట్లను కూడా రెండింతలకు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఎంత పెట్టుబడి పెట్టనుందనే విషయాన్ని తెలపలేదు. కంపెనీ లాంచ్ చేసే ఒరిజినల్ సిరీస్‌లను కరణ్ జోహార్, జోయా అక్తర్ వంటి బాలీవుడ్ డైరెక్టర్లు రూపొందిస్తున్నారు. భారత్‌లో లోకల్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసేందుకు, కొనుగోలు చేసేందుకు అమెజాన్ భారీగా పెట్టుబడి పెట్టనుందని ఫౌండర్ జెఫ్ బెజోస్ గతంలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
0 Comments:
Post a Comment