8 మంది ఐఏఎస్‌లపై మళ్లీ ‘ధిక్కరణ
8 మంది ఐఏఎస్‌లపై మళ్లీ ధిక్కరణ!
ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో సచివాలయాలు, ఆర్బీకేలు
అన్నీ తొలగించామని తప్పుడు అఫిడవిట్ వేశారుపరిస్థితిపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌తో విచారణహైకోర్టు సంచలన నిర్ణయం‘సేవా శిక్ష’ రద్దుకు నిరాకరణశ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేతసామాజిక సేవకు నాడు అంగీకరించిఇప్పుడు పునఃసమీక్ష కోరతారా?మీరసలు కోర్టు ఉత్తర్వులే చదవలేదుమా ఆదేశాలకు ఇచ్చే గౌరవమిదేనా?అమలు చేయకుండా తప్పించుకునే యత్నాలను ఉపేక్షించం: హైకోర్ట్ఙు
తీర్పు ఇచ్చే రోజు కోర్టు ప్రతిపాదించిన సామాజిక సేవకు అంగీకరించి.. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ ఇప్పుడు రివ్యూ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారు?
న్యాయస్థానం తొలుత ఇచ్చిన ఆదేశాలను 8 మంది ఐఏఎస్‌లలో ఎవరైనా కళ్లతో చూశారా అని విచారణ సందర్భంగా ప్రశ్నించినప్పుడు.. ఒక్కరు కూడా కోర్టు ఉత్తర్వులను చదివినట్లు చెప్పలేదు. మా ఉత్తర్వులకు ఇచ్చే గౌరవం ఇదేనా?
కొన్ని ప్రాంతాల్లో పాఠశాల ప్రాంగణాల్లోని గ్రామ సచివా లయాలు, ఆర్బీకే కేంద్రాలు తొలగించకుండా.. పాఠశాల, కార్యాలయాల మధ్య గోడ ఏర్పాటు చేసి.. ఆదేశాలను అమలు చేశామని అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.
హైకోర్టు
అమరావతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. గతంలో ఇదే అంశంపై 8 మంది సీనియర్ ఐఏఎ్‌సలకు ‘సేవా శిక్ష’ విధించిన న్యాయస్థానం... వారిపై కోర్టు ధిక్కరణ కేసును తిరిగి తెరుస్తామని తెలిపింది. ‘‘పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, ఆర్బీకేలను తొలగించామని అధికారులు న్యాయస్థానం ముందు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పాఠశాలల ప్రాంగణాల్లో ఆ కార్యాలయాలు కొనసాగుతూనే ఉన్నాయి’’ అని తెలిపింది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలను ప్రస్తావించింది. ‘‘ఆ వార్తా కథనాలు వాస్తవమో కాదో నిర్ధారించుకునేందుకు సంబంధిత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాం. పత్రికల్లో వ చ్చిన వార్తలు వాస్తవమేనని తేలింది. అందువల్ల... 8 మంది ఐఏఎ్‌సలపై కోర్టు ధిక్కరణ కేసును తిరిగి తెరుస్తాం’’ అని స్పష్టం చేసిం ది. పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాల ను, ఆర్బీకేలను తొలగించడంలో ఉద్దేశపూర్వ క జాప్యం చేసిన 8 మంది ఐఏఎ్‌సలకు కోర్టు ‘సామాజిక సేవా శిక్ష’ విధించిన సంగ తి తెలిసిందే. నెలలో ఒక రోజు చొప్పున... ఏడాదిపాటు సంక్షేమ వసతి గృహాలకు వెళ్లాలని, విద్యార్థులకు సొంత ఖర్చుతో ఒక పూ ట భోజనం పెట్టాలని గతంలో తీర్పు చెప్పి ంది. అయితే.. ఈ ‘శిక్ష’ను పునఃసమీక్షించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వై.శ్రీలక్ష్మికి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కోర్టు ధిక్కరణకు గాను మొదట రెండు వారాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించామని.. భేషరతుగా క్షమాపణలు చెబుతూ.. సామాజిక సే వ చేయడానికి అంగీకరించడం వల్లే శిక్షను సవరించామని గుర్తుచేసింది. తీర్పు వెలువరించే సమయంలో సామాజిక సేవకు అంగీకరించి.. ఇప్పుడు పునఃసమీక్షించాలని కోరు తూ రివ్యూ పిటిషన్ వేయడం ఏంటని ప్ర శ్నించింది. న్యాయస్థానం దృష్టిలో పిటిషనర్ కు విధించింది అసలు శిక్షే కాదని వ్యాఖ్యానించింది. రివ్యూ పిటిషన్‌ను అనుమతించేందుకు సహేతుకమైన కారణాలు లేవని అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఆదేశాలిచ్చారు. విచారణ సందర్భంగా అధికారుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.
విచారణ జరిపిస్తాం...మొత్తం 1,134 పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు తొలగించారా.. లేదా? ఎన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల మధ్య గోడలు నిర్మించారు తదితర అంశాలపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపిస్తామని జస్టిస్ దేవానంద్ తెలిపారు. పూర్వం పాఠశాల ప్రాంగణం ఎంత విస్తీర్ణంలో ఉంది.. కార్యాలయాల నిర్మాణంతో తగ్గిందా అనే విషయాన్ని సర్వేయర్ ద్వారా నిర్ధారిస్తామని చెప్పారు సంబంధిత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల నుంచి వివరాలు తెప్పించుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేం ద్రాలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ ప లు వ్యాజ్యాల దాఖలయ్యాయి. ఆ వ్యాజ్యాల ను విచారించిన హైకోర్టు.. వాటిని తక్షణం తొలగించాలని 2020 జూన్‌లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలుకాకపోవడంతో సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి.. పంచాయితీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ వి. చినవీరభద్రుడు, పురపాలక శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పురపాలకశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, అప్పటి డైరెక్టర్ జి.విజయకుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎం.ఎం.నాయక్‌లకు 2 వారాల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.1,000 చొప్పున జరిమానా విధించింది. అయితే అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో శిక్షను సవరించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని, నెలలో ఒక ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సమయం కేటాయించాలని అధికారులను ఆదేశించింది. ఆ రోజు మధ్యాహ్నం లేదా రాత్రి విద్యార్థులకు అయ్యే భోజన ఖర్చులను అధికారులే భరించాలని స్పష్టం చేసింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ వై.శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఉత్తర్వుల గురించి ఆమెకు తెలియదు:పిటిషనర్ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పాఠశాలల ప్రాంగణాల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను తొలగించాలని కోర్టు 2020 జూన్ 11న ఆదేశాలిచ్చిందని.. కానీ శ్రీలక్ష్మి ఆ ఏడాది డిసెంబరు 24న.. అంటే ఆదేశాలిచ్చిన ఆరు నెలల తర్వాత పురపాలక శాఖ బాధ్యతలు చేపట్టారని తెలిపారు. కోర్టు సుమోటో కోర్టు ధిక్కరణగా తీసుకున్న తర్వాత న్యాయస్థానానికి హాజరయ్యే వరకు ఆమెకు ఆ ఉత్తర్వులపై అవగాహన లేదన్నారు. కోర్టుకు హాజరైన రోజునే పాఠశాలల ప్రాంగణాల్లో ఉన్న వార్డు సచివాలయాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. కింది స్థాయి అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో రివ్యూ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. కోర్టుకు సహాయకుడిగా ఉన్న అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. పిటిషనర్ వాదన సహేతుకంగానే ఉందన్నారు. కోర్టు ముందు హాజరైన రోజే కార్యాలయాల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అయితే.. తీర్పు ఇచ్చే రోజు కోర్టు ప్రతిపాదించిన సామాజిక సేవకు అంగీకరించి.. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయస్థానం దృష్టిలో పిటిషనర్‌కు విధించింది అసలు శిక్షే కాదన్నారు.
ఈ నేపథ్యంలో పునఃసమీక్ష పిటిషన్‌కు విచారణార్హత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన తమ్ముడు బీఆర్ అంబేడ్కర్ కూడా ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నారని.. ఈ ఎనిమిది మంది ఐఏఎ్‌సలలో ఆయన ఉన్నా ఇదే శిక్ష వేసేవాడినని తేల్చిచెప్పారు. న్యాయస్థానం ముందు అందరూ సమానమేనన్నారు. రాజ్యాంగానికి అందరూ కట్టుబడి వ్యవహరించాల్సిందేనని స్పష్టంచేశారు. శ్రీలక్ష్మి వేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
0 Comments:
Post a Comment