6 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నూతనంగా ఏర్పాటైన 13 జిల్లా కేంద్రాల్లో భూముల స్ధిరీకరణకు సంబంధించి మార్కెట్ విలువ పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది.
దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈనెల 6 నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రజత్ భార్గవ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 5 నుంచి 20 శాతం వరకూ పెరిగే అవకాశముంది. కొత్త జిల్లా కేంద్రాలైన ఎన్‌టిఆర్ విజయవాడ, బాపట్ల, తిరుపతితోపాటు నగరానికి సమీపంలోని రూరల్ ప్రాంతాల్లోనూ భూముల విలువ గణనీయంగా పెరిగే అవకాశముందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ అంచనా వేస్తోంది.
దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. భూములు వాణిజ్య అవసరాలకు ఉపయోగపడతాయా? కొత్తగా పరిశ్రమలు ఆయా ప్రాంతాల్లో స్ధాపిం చారా? వ్యాపార టర్నోవర్ ఏ స్ధాయిలో ఉంటుంది? తదితర అంశాలను లెక్కగట్టి మార్కెట్ విలువను లెక్కించనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువకు సంబంధించి గతంలో జాయింట్ కలెక్టర్లతో వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
0 Comments:
Post a Comment