✍️ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్
♦సెప్టెంబరు 11న ఫలితాల వెల్లడి
*🌻ఈనాడు, న్యూస్:* ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ బాంబే గురువారం కొత్త కాలపట్టికను విడుదల చేసింది. జేఈఈ మెయిన్ చివరి విడత జులై 30వ తేదీతో ముగుస్తుంది. ఎన్‌టీఏ అధికారులు మెయిన్ ర్యాంకులను ఆగస్టు 6వ తేదీన వెల్లడిస్తామని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దాంతో అందులో ఉత్తీర్ణులైన వారు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు ఆగస్టు 7వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఐఐటీ బొంబాయి ప్రకటించింది. ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను అదే నెల 28వ తేదీన నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను సెప్టెంబరు 11వ తేదీన వెల్లడిస్తారు. ఒకవేళ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనవారు ఐఐటీల్లో బీఆర్క్ చదవాలనుకుంటే సెప్టెంబరు 14న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)ను జరుపుతారు. వాటి ఫలితాలు 17వ తేదీన ప్రకటిస్తారు.
0 Comments:
Post a Comment