✍️10 రోజుల బ్రేకప్ విధానం వద్దు
♦కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల యూనియన్
🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
విద్యాశాఖలో అమలవుతున్న బ్రేకప్ విధానాన్ని తొలగించాలని ఎపి ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిజె గాంధీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్ చేయాలని ఇంటర్ కమిషనరేట్ ప్రభుత్వానికి మార్చి 25న ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. రెన్యువల్ ఉత్తర్వులు విడుదల చేయాలని సిఎం, ఆర్థిక, విద్యాశాఖ మంత్రులు, అధికారులను అసోసియేషన్ తరపున పలుమార్లు కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని, అయితే ఏ శాఖలో లేని విధంగా 10 రోజుల బ్రేక్ విధానం విద్యాశాఖలోనే అమలు చేస్తుందని తెలిపారు. దీనిని తొలగించాలని అనేకసార్లు వినతిపత్రాలు ప్రభుత్వానికి సమర్పించినా... స్పందన లేదని పేర్కొన్నారు. ఈ విధానాన్ని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
0 Comments:
Post a Comment