calcium Laddu : ఈ రోజుల్లో సమస్యలు అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. అసలు సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి.
ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి వంటివి వచ్చేస్తున్నాయి.
అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం రావటమే కాకుండా వేసవిలో వచ్చే నీరసం,నిస్సత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేయటానికి ఇప్పుడు చెప్పే లడ్డు సహాయపడుతుంది.
దీని కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అరకప్పు నువ్వులను దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి.
కప్పున్నర ఖర్జూరం తీసుకొని గింజలు తీసేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో వేగించి పెట్టుకున్న నువ్వులను కలిపి చిన్న చిన్న లడ్డులుగా చేసుకొని రోజు ఒక లడ్డు తినాలి.
వీటిని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిలో calcium సమృద్దిగా ఉండుట వలన చాలా తొందరగానే మార్పు అనేది కనిపిస్తుంది.
నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనకు నువ్వులు,ఖర్జూరం రెండూ సులభంగా అందుబాటులోనే ఉంటాయి.
కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ లడ్డులను తయారుచేసుకొని తింటే చాలా మంచిది.
0 Comments:
Post a Comment