Vision Problems : దృష్టిలోపం సమస్యలను.ఈ ఆహారాలతో అధిగమించండి?
Vision Problems : ప్రపంచాన్ని చూడటానికి కళ్ళు అత్యంత ముఖ్యమైన ఇంద్రియ అవయవాలు.
చిన్నవయస్సులోనే అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ లను ధరించాల్సి వస్తుంది. ఇందుకు కంటి చూపుకు అవసరమైన పోషకాహారాన్ని తీసుకోకపోవటం ఒక కారణమైతే, గంటల తరబడి కంప్యూటర్లు, సెలఫోన్లతో గడిపేయటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు.
అయితే ప్రధానంగా దృష్టిలోపం సమస్యను అధిగమించేందుకు కొన్ని రకాల ఆహారాలు మేలు చేస్తాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
క్యారెట్లు ; కంటి చూపును మెరుగుపరచటంలో క్యారెట్లు ఉపకరిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఇందులో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఎ, కంటి చూపును మెరుగుపరచటంలో తోడ్పడతాయి.
రాత్రి సమయంలో దృష్టిలోపం, కంటి చూపు క్షీణించటాన్ని క్యారెట్ ను ఆహారంలో తీసుకోవటం ద్వారా నిరోధించ వచ్చు. క్యారెట్ ను అతిగా కాకుండా తగిన మోతాదులో తీసుకోవటం మంచిది.
చేపలు ; చేపలలో ఒమేగా-3-ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3,ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ నిష్పత్తిని సమతుల్యం చేయడం ద్వారా ఒమేగా-3 వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
వాపు స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, మీ శరీరం మరియు మెదడు పనితీరు మెరుగుపడుతుంది, తద్వారా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రెటీనా మెరుగుపర్చటం ద్వారా కంటి చూపు పెరిగేలా చేస్తుంది.
సాల్మన్, ట్యూనా ,మాకేరెల్ వంటి చేపలను తీసుకోవడం కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చేపలు తినలేకపోతే వైద్యుల సలహాతో ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
బచ్చలి కూర ; బచ్చలికూరలో విటమిన్లు ఇ, ఎ, బి, సి, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు, లుటిన్ ,జియాక్సంతిన్ వంటి ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
కెరోటినాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
అందువల్ల, బచ్చలికూరను ప్రతిరోజూ తగినంత మొత్తంలో తీసుకోవడం వల్ల మాక్యులార్ డీజెనరేషన్ , కంటిశుక్లం నివారించవచ్చు. ఇందులో జింక్ ఉన్నందున, బచ్చలికూర కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుడ్లు ; గుడ్లు అవసరమైన అమైనో ఆమ్లాలు, నీటిలో , కొవ్వులో కరిగే విటమిన్లు రెండింటినీ కలిగి ఉంటాయి.
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్లో కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, లుటీన్ ,జియాక్సంతిన్లకు అధికంగా ఉంటాయి.
కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినండి. ఉడికించిన గుడ్లు ఉత్తమమైనవి.
డైరీ ఉత్పత్తులు ; కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాలు, పెరుగు గ్రేట్ గా సహాయపడుతాయి. కాల్షియం మరియు ఫాస్పరస్ , జింక్, విటమిన్ ఎతో నిండి ఉంటాయి. విటమిన్ ఎ కార్నియాను రక్షించడంలో సహాయపడుతుంది.
జింక్, విటమిన్ ఎను రాత్రి సమయంలో దృష్టికి సహాయపడుతుంది. కంటిశుక్లం రాకుండా నివారిస్తుంది. ఉదయం, రాత్రి పడుకునే ముందు పాలు తాగవచ్చు. భోజనం తర్వాత పెరుగు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నట్స్ ; నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E లను కలిగి ఉంటాయి. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
విటమిన్ ఇ పుష్కలంగా ఉండే గింజలను తీసుకోవడం వల్ల వయసు సంబంధిత కంటిశుక్లం ఏర్పడకుండా నిరోధించవచ్చని పరిశోధనలు నిర్ధారించాయి.
దృష్టిలోపం సమస్యలను పోగొడతాయి. నిత్యం గుప్పెడు బాదం పప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి.
తృణధాన్యాలు ; డైటరీ ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్లు, మినరల్స్ తృణధాన్యాల్లో అధికంగా ఉంటాయి. జింక్ విటమిన్ ఇ వీటిలో ఉండే రెండు ప్రధాన ఖనిజాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.
కంటి వ్యాయామాలు ; కంటి కండరాలను బలోపేతం చేయడానికి కంటి వ్యాయామం చేయాలి. కళ్లను తిప్పడం వంటి కంటి వ్యాయామాలతో మంచి ఫలితం ఉంటుంది.
ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, సెల్ ఫోన్లతో ఎక్కువ సేపు గడిపేవారు ప్రతి గంటకు కళ్ళను చల్లని నీటితో కడుక్కోవటం మంచిది.
0 Comments:
Post a Comment