1. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ కోసం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఎంచుకోవడం విశేషం.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం దేశంలోనే తొలి రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషను ఎంచుకోవడం విశేషం. మార్చి 25న ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది.
2. తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రమోషనల్ హబ్‌గా మార్చడం, స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తుల్ని తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రమోట్ చేయడం, తద్వారా స్థానిక ఇండస్ట్రీలకు మద్దతుగా నిలవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీని ద్వారా స్థానిక కళాకారులు, కార్మికులు, గిరిజనులకు మెరుగైన జీవనోపాధి లభిస్తుంది.
3. తిరుపతికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. వారిలో ఎక్కువ మంది రైలు మార్గం ద్వారానే తిరుపతికి చేరుకుంటారు. వారికి స్థానిక కళలను పరిచయం చేసేందుకు భారతీయ రైల్వే చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది.
4. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు కళంకారి కళకు ఫేమస్. కళంకారి దుస్తులకు, స్థానిక తయారయ్యే వస్త్రాలకు డిమాండ్ ఉంటుంది. 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' ప్రాజెక్ట్ కోసం తిరుపతి రైల్వే స్టేషన్‌ను సెలెక్ట్ చేయడంతో కళంకారి చీరలు, ఇతర దుస్తులు, స్థానిక వస్త్రాలు రైల్వే స్టేషన్లో కనిపించబోతున్నాయి. వాటిని ప్రయాణికులు కొనొచ్చు.
5. తిరుపతి రైల్వే స్టేషన్ లాగానే అన్ని జోనల్ రైల్వేలు తమ పరిధిలో ఓ రైల్వే స్టేషన్‌ను 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేస్తున్నాయి. ఆ స్టేషన్ పరిధిలో ఫేమస్ అయిన ఉత్పత్తుల్ని ఈ ప్రాజెక్టులో భాగంగా రైల్వే స్టేషన్లో ప్రమోట్ చేస్తాయి. పైలట్ ప్రాజెక్ట్ 15 రోజుల పాటు ఉంటుంది.
6. స్థానిక ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి లాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లను ఎంచుకుంటోంది భారతీయ రైల్వే. ప్రధాన రైల్వే స్టేషన్లలో నిత్యం వచ్చిపోయే వేలాది మంది ప్రయాణికులకు ఆ ఉత్పత్తుల్ని పరిచయం చేయనుంది. ప్రతీ రైల్వే స్టేషన్‌ను ప్రమోషనల్ హబ్‌గా మార్చడంతో పాటు స్థానిక ఉత్పత్తులకు వేదికగా నిలపాలన్నది భారతీయ రైల్వే లక్ష్యం.
7. అంతేకాదు... ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు సప్లై చెయిన్ సహకారాన్ని కూడా భారతీయ రైల్వే అందించనుంది. రైతులు, వ్యవసాయ సంస్థలకు మాత్రమే కాదు ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఉన్న కళల్ని, లభించే వస్తువుల్ని దేశమంతా పరిచయం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది.
0 Comments:
Post a Comment