Smart Phone Tips: ఈ సెట్టింగ్స్ మార్చుకోండి.. మీ ఫోన్ పోతే కనిపెట్టేయొచ్చు..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ (Smart Phone) ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్‌తోనే సహవాసం చేస్తుంటాం.
అటువంటి ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకుంటే, ఎంతో హైరానా పడిపోతుంటాం. ముఖ్యంగా దానిలో ఉన్న విలువైన డేటా గురించి ఆందోళన చెందుతుంటాం. ఫోన్ వెతకడం కోసం పడరాన్ని పాట్లు పడుతుంటాం. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో మనం పొగొట్టుకున్న మొబైల్ (Mobile) ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు. దాని కోసం ఉన్న మార్గాలను తెలుసుకుందాం. మీ ఫోన్లో ఇలాంటి చిన్న సెట్టింగ్స్ చేస్తే మీ ఫోన్ పోయినా ఎక్కడ ఉందో కనిపెట్టేయొచ్చు.
ఫైండ్ మై డివైజ్ సెట్టింగ్స్
ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్‌లో ఫైండ్ మై డివైజ్ అనే ఫీచర్ ఉంటుంది. మీరు మీ ఫోన్‌ను కొన్న వెంటనే ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసుకోవడం మంచిది. ఈ సెట్టింగ్ ఆన్ చేసేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్‌లో ఇలా చేయండి.
ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ విధానం..
స్టెప్ 1: సెట్టింగ్స్ మెను తెరిచి దానిలోని 'సెక్యూరిటీ' (Security) అనే సబ్ మెనూలోకి వెళ్లండి.
స్టెప్ 2: ఇప్పుడు, 'ఫైండ్ మై డివైజ్' ఆప్షన్‌లోకి వెళ్లి దాన్ని ఆన్ చేయండి.
స్టెప్ 3: ఆ తర్వాత ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా ఏదైనా ఇతర మొబైల్ డివైజ్ నుండి https://www.google.com/android/find వెబ్సైట్లోకి వెళ్లి ఈ మొబైల్ లొకేషన్ కనుగొనండి.
స్టెప్ 4: రెండు డివైజెస్లోనూ ఒకే గూగుల్ అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వండి.
స్టెప్ 5: అప్పుడు మీ ఫోన్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూసుకోవచ్చు. మీకు మ్యాప్పైన ప్లే సౌండ్, సెక్యూర్ డివైజ్, ఎరేజ్ డివైజ్ అనే మూడు ఆప్షన్లు ఇవ్వబడతాయి. వాటిలో 'ప్లే సౌండ్' ఆప్షన్‌ను ఎంచుకోండి. కొన్ని సెకన్లలో, మీ డివైజ్ మోగడం ప్రారంభమవుతుంది. ఒకవేళ మీ ఫోన్ దగ్గర్లోనే ఉంటే వెంటనే కనిపెట్టవచ్చు.
Google Account: గూగుల్ ఎకౌంట్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
ఐఓఎస్ డివైజెస్‌లో..
స్టెప్ 1: iOS పరికరాల్లో, ఫైండ్ మై డివైజ్ సెట్టింగ్ ఆటోమేటిక్‌గా 'ఆన్' అవుతుంది. అయినా సరే సెట్టింగ్స్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవడం మంచిది.
స్టెప్ 2: ఇప్పుడు, మీ ఆపిల్ ఐడి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ మెనూ పై మీ పేరును ఎంచుకోండి.
స్టెప్ 3: ఆ తర్వాత ఫైండ్ మై సెట్టింగ్‌లోకి వెళ్లండి.
స్టెప్ 4: 'ఫైండ్ మై ఐఫోన్ సెట్టింగ్' ఆన్ ' చేయండి.
స్టెప్ 5: వేరే డివైజ్‌లో మీరు https://www.icloud.com/find/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. అయితే, రెండు డివైజెస్లోనూ ఒకే మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వడం మర్చిపోకండి.
స్టెప్ 6: మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత, మీ ఫోన్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూపిస్తుంది. ఆ తర్వాత 'ప్లే సౌండ్' ఆప్షన్లోను ప్రారంభించండి. తద్వారా, మీ ఫోన్ దగ్గర్లో ఉంటే సులభంగా గుర్తించవచ్చు.
0 Comments:
Post a Comment