మహిళలకు ఆత్మరక్షణ(Self-defense) కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (MSDE) మంత్రిత్వ శాఖ.
మార్చి 29న ఐదు రోజుల స్వీయ-రక్షణ శిక్షణ- "మేరి సురక్ష, మేరీ జిమ్మేదారి" ప్రోగ్రామ్‌ను(Programme) ప్రారంభించింది.
ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధి, ఆలోచన విధానం మార్పును తీసుకొచ్చేందుకు ప్రారంభించిన 'మిషన్ కర్మయోగి'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ స్వీయ-రక్షణ కార్యక్రమాన్ని స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్(Physical Education), ఫిట్నెస్, లీజర్ స్కిల్స్ కౌన్సిల్ (SPEFL-SC) ద్వారా రూపొందించారు.
క్రావ్ మాగా, కలి, సిలాట్, వింగ్ చున్ అనే ఇతర పోరాట వ్యవస్థల ఆధారంగా శిక్షణ ఇస్తారు. ఇప్పటి వరకు 50 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో..'కార్యక్రమంలో బోధిస్తున్న వారు పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వగలరు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతలను బోధించడంలో నిపుణులు.
ఈ టెక్నిక్‌లు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారు రూపొందించారు. వీటిని నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం సులభం' అని పేర్కొంది. వర్క్‌షాప్‌ల ప్రాముఖ్యతను స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వివరించారు.
ఆయన మాట్లాడుతూ.. 'మహిళల భద్రతకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఆత్మరక్షణ కార్యక్రమంతో మహిళలు శిక్షణలో పాల్గొనేలా ప్రోత్సహించాలని భావిస్తున్నాం.
ఎలాంటి దాడులైనా, బెదిరింపుల నుంచైనా తమను తాము రక్షించుకోవడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. మహిళలు స్వీయ రక్షణ నిపుణుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్చుకునే వేదికలను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.' అని వివరించారు.
క్రీడలు, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ & లీజర్ స్కిల్స్ కౌన్సిల్ సీఈవో తహ్సిన్ జాహిద్ మాట్లాడుతూ.. 'మహిళలకు సురక్షితమైన వాతావరణం ఆవశ్యకత ఉంది.
ఇలాంటి కార్యక్రమాలు సరైన దిశలో ఫలితాలు అందిస్తాయి. ముప్పు ఎదురైనప్పుడు తమను తాము రక్షించుకునే విధంగా మహిళలను తీర్చిదిద్దాలి.' అని చెప్పారు.
సంబంధిత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో.. 'మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్చుకోవడం ఈ సమయంలో అవసరం.
జాగ్రత్తగా ఉండటం సురక్షితంగా ఉండటానికి కీలకం. ఆత్మరక్షణ పద్ధతులను నేర్చుకోవడంతో నేరాల నుంచి బయటపడతారు. మహిళలపై నేరాల సంఖ్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది,' అని తెలిపింది.
కార్యక్రమం కింద.. ఆత్మరక్షణ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఎక్కువ మంది దాడి చేస్తున్న సమయంలో బయటపడటం, మగ్గింగ్ను ఎదుర్కోవడంపై శిక్షణ ఇస్తున్నారు.
అంతేకాకుండా కత్తి, తుపాకులతో దాడికి దిగిన సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలనే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ శిక్షణలో స్లాప్లు, పంచ్‌లు, స్ట్రీట్ స్మార్ట్‌నెస్, నిర్భయ సెల్ఫ్ డిఫెన్స్ కిట్ల వినియోగం గురించి చెబుతున్నారు.
0 Comments:
Post a Comment