Saving Schemes: ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేసే 3 పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లు ఇవే...
చక్కటి ఆర్థిక ప్రణాళిక (Financial Planning)తో ఉత్తమ పథకాల్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి (Good Returns) అందుకోవచ్చు.
అయితే లో-రిస్కుతో మంచి రిటర్న్స్ అందించే పెట్టుబడుల అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్సే (Fixed Deposits) గుర్తుకొస్తాయి. నిజానికి ఎఫ్డీ (FD)ల కంటే అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేసే పెట్టుబడి పథకాలు (Investment Schemes) చాలానే ఉన్నాయి.
పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ (Post Office Saving Schemes) కూడా ఈ కోవకు చెందినవే! పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఎక్కువగా రిటర్న్స్ అందిస్తాయి. అది కూడా చాలా తక్కువ రిస్కుతో! ఫిక్స్డ్ డిపాజిట్లకు బ్యాంకుల మద్దతు ఉన్నప్పటికీ, ఇందులో పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌ల వలె వడ్డీ రేటు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండవు.
పోస్టాఫీసు స్కీమ్‌లకు గవర్నమెంట్ మద్దతిస్తుంది. ఇవి 5.5-7.6% మధ్య వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయి. ఇలా అధిక వడ్డీ రేట్లతో పాటు, పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లు పన్ను బాధ్యతను తగ్గిస్తాయి. మరి వీటిలో 3 బెస్ట్ పోస్టాఫీసు స్కీమ్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సుకన్య సమృద్ధి యోజన (SSY)
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఆడపిల్లల కోసం ఉద్దేశించినది. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిల కోసం ఈ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది 7.6 శాతం వడ్డీ రేటుతో రాబడిని అందిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద కనిష్ఠంగా రూ. 250, గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం కింద అకౌంట్ హోల్డర్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పొందే వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఓపెన్ చేసే అకౌంట్ 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇందులో ఖాతా తెరవవచ్చు. ఖాతాలో చేసే డిపాజిట్లు తప్పనిసరిగా రూ. 1,000 గుణిజాలలో ఉండాలి. ఒక వ్యక్తి చేసే గరిష్ట డిపాజిట్ రూ. 15 లక్షలకు మించకూడదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500, గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అకౌంట్ ఓపెనింగ్ మినిమం అమౌంట్ మాత్రం రూ.100 ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుతం ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కింద ఖాతా తెరిచిన ఏడాది మినహా, పీపీఎఫ్ పథకం కోసం ఖాతా మెచూరిటీ వ్యవధి 15 ఏళ్లుగా ఉంటుంది.
0 Comments:
Post a Comment