Rainbow Tree: రంగులు చల్లలేదు..ఈ చెట్టే అలా ఉంటుంది.. భూమిపై ఇంత అందమైనది ఇంకేదీ లేదేమో..
ఈ ప్రకృతి ఎంతో అందమైనది.
ఇందులో మనకు తెలియని వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. భూమిపై ఎన్నో సహజ అద్భుతాలు మనకు కనువిందు చేస్తాయి. అందులో ఒకటి రెయిన్ బో యూకలిఫ్టస్. చెట్టుపై ఎవరో పెయింట్ చల్లినట్టుగా.. ఏడు రంగుల్లో ఇది మెరిసిపోతుంది. (Image:Twitter/Susanta Nanda IFS)
రెయిన్బో యూకలిప్టస్ చెట్టు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. IFS అధికారి సుశాంత్ నందా రెయిన్బో యూకలిప్టస్ ఫొటోలను సోషల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు హోలీ సీజన్ కావడంతో ఈ రంగురంగుల చెట్టుపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. (Image:Twitter/Susanta Nanda IFS)
ఇంద్రధనస్సు రంగుల్లో కనిపించడమే దీని ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని అత్యంత రంగులమయమైన చెట్లలో ఒకటిగా చెబుతారు. సాధారణ భాషలో దీనిని రెయిన్బో యూకలిప్టస్ అని పిలుస్తారు, కానీ శాస్త్రీయ భాషలో దీనిని యూకలిప్టస్ డెగ్లుప్టా అంటారు. (Image:Twitter/Susanta Nanda IFS)
ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే.. చెట్టు కాండంపై రకరకాల రంగులు కనిపిస్తాయి. అందులో వెదజల్లే రకరకాల రంగులు. కొన్ని ప్రదేశాలలో దీనిని రెయిన్బో గమ్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ చెట్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కనిపిస్తాయి. వర్షారణ్యాలలో కనిపించే యూకలిప్టస్ జాతి ఇదొక్కటేనని చెబుతారు.(Image:Twitter/Susanta Nanda IFS)
OneEarth నివేదిక ప్రకారం... రెయిన్బో యూకలిఫ్టస్ వయసు పెరిగే కొద్దీ.. దాని రంగులు కూడా మారుతాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవు. చెట్టు పెరిగేకొద్దీ, దాని బెరడు బయటకు వస్తుంది. అప్పుడు కాండంపై ఉన్న రంగులు బయటపడతాయి. ఆ రంగుల్లో రెయిన్బో యూకలిఫ్టస్ చెట్టు అందంగా కనిపిస్తుంది. సూర్యకాంతిలో మరింతగా మెరిసిపోతుంది.
0 Comments:
Post a Comment