🔳PRC పై చర్చకు నో - మండలిలో పిడిఎఫ్ సభ్యుల ఆందోళన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పిఆర్సిపై చర్చకు శాసనమండలిలో అనుమతి లభించలేదు. దీంతో పిడిఎఫ్ సభ్యులు ఛైర్మన్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను అధ్యక్షతన గురువారం సమావేశం ప్రారంభం కాగానే అశుతోష్ మిశ్రా నివేదికకు అనుగుణంగా సవరించిన పిఆర్సి ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎఫ్ ఫ్లోర్‌లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ వెంకటేశ్వరావు, షేక్ సాబ్జీతో పాటు స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ ఛైర్మన్‌కు వాయిదా తీర్మానం అందచేశారు. అయితే, దీనిని తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిడిఎఫ్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై చర్చించాలనిబిఎసిలోనే తాము కోరామని ప్రభుత్వం కూడా చర్చించేందుకు అంగీకరించిందని, చర్చ జరపాల్సిందేనని పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం పట్టుబట్టారు. స్వల్పకాలిక చర్చ సందర్భంలో దీనిపై చర్చిద్దామని ఛైర్మన్ సూచించారు. దీనికి పిడిఎఫ్ సభ్యులు తిరస్కరించారు. పోడియంలోకి వెళ్లి ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సానుకూలంగా ఉందని, సంబంధిత మంత్రి సభలో ఉన్న సమయంలో చర్చ జరుపుతామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. దీంతో పిడిఎఫ్ సభ్యులు ఆందోళన విరమించారు.
0 Comments:
Post a Comment