Postings for Aided Teachers in Category-3,4 vacancies
కేటగిరి-3,4 ఖాళీలోనే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పోస్టింగ్లు
🌻ఈనాడు, అమరావతి: ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ కేవలం కేటగిరి-3.4 ఖాళీ స్థానాలు మాత్రమే చూపించడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగులకు ఎలాంటి అదనపు పాయింట్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,994 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉండగా. 2,104 మంది ప్రభుత్వంలో విలీనమయ్యారు. కొన్ని ఎయిడెడ్ పాఠశాల లను ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు యాజమాన్యాలు అంగీకారం తెల పడం, మరికొన్ని విద్యార్థులు లేక మూతపడడం లాంటి ఘటనలతో 2,104 మంది ప్రభుత్వంలో విలీనమయ్యారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టింగ్లు ఇచ్చేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
0 Comments:
Post a Comment