teacher is owner of 20 colleges : మధ్యప్రదేశ్ లోని ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆస్తులు చూసి అధికారులు అవాక్కయ్యారు.
వేలల్లో జీతం తీసుకునే ప్రాధమిక పాఠశాలలో టీచర్ గా పనిచేసే వ్యక్తి ఏకంగా 20 కాలేజీలకు యజమాని.
ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సాధారణ స్కూలు టీచర్ ఇన్ని కాలేజీలకు ఎలా యజమానిగా మారాడన్న విషయం అధికారులను విస్మయానికి గురిచేసింది.
మధ్యప్రదేశ్లోని ఘాటిగావ్ కు చెందిన ప్రశాంత్ పర్మార్...అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. ప్రశాంత్ పార్మర్ 2006 లో ఉద్యోగంలో చేరారు.
అప్పుడు ఆయన జీతం 3,500 మాత్రమే. ఇప్పుడు మాత్రం కోట్లకు చేరింది. ఓ సాధారణ ఉపాధ్యాయుడు వేల కోట్లు సంపాదించుకున్నారని, 20 కాలేజీలు కూడా ఉన్నాయని ఆర్థిక నేర విభాగం వారికి ఎవరో చేరవేశారు.
వెంటనే అధికారులు రంగంలోకి దిగి..ప్రశాంత్ పర్మార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో అతడి నివాసం, ఇతర ప్రదేశాల్లో దాడులు చేపట్టారు.
ఆర్థిక నేరాల విభాగం అధికారులు చేసిన దాడుల్లో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
ఆయన ఆస్తులు చూసి నివ్వెరపోయారు. కోట్ల విలువ చేసే ఆస్తులకు అతడు అధిపతి అని తెలుసుకున్నారు.
మధ్యప్రదేశ్లోని చంబల్తో సహా మరిన్ని ప్రాంతాల్లో ప్రశాంత్ పర్మార్ కు బీఈడీ కాలేజీలతో పాటు ఇతర కాలేజీలు ఓ 20 ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు.
అంతేకాదు.. 3 నర్సింగ్ కాలేజీలు, ఇతర ఆఫీసులు కూడా ఉన్నాయట. వీటికి సంబంధించిన పత్రాలన్నింటినీ ఆర్థిక నేర విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కొద్దికాలంలోనే ఆయన ఈ స్థాయికి రావడానికి ఏ స్థాయిలో అక్రమాలు చేశాడో అని అధికారులు విస్తుపోయారు.
0 Comments:
Post a Comment