Mustard Powder Benefits : మన వంటింటిలో ఉండే దినుసుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో అవాల గురించి తెలుసుకుందాం. అవాలను వేగించి పొడిగా తయారుచేసుకోవాలి.
ఈ పొడిని ప్రతి రోజు పావు స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం లేదా రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి.
ఈ విధంగా తాగటం వలన నరాల బలహీనత సమస్య అలాగే నాడీ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో వేడిని పుట్టించి శరీరంలో పెరుకు పోయిన కొవ్వును కరిగిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
ఆవాలులో రుబేసియెంట్ లక్షణాలు ఉండుట వలన కండరాల నొప్పులను,కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
ఆవాలులో మెగ్నీషియం, కాల్షియం మరియు సెలీనియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేయటమే కాకుండా మోనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
శరీరం లోపల వెచ్చగా ఉండేలా చేసి సైనస్, ఆస్తమా వంటి శ్వాస కోశ సమస్యల ఉపశమనం కలిగేలా చేస్తుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ అవాల పొడి, అరస్పూన్ నిమ్మరసం,అరస్పూన్ తేనె, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి తాగితే గొంతు నొప్పి, గొంతు గరగర వంటి సమస్యలు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
0 Comments:
Post a Comment