Musk Melon : వేసవిలో ఖర్భూజా తినటం ఆరోగ్యానికి మంచిదా?.
Musk Melon : ఖర్భూజా పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి, ఎండ వేడి నుండి ఖర్బూజా మనల్ని కాపాడుతుంది.
దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో ఎక్కవగా ఈ పండ్లు మార్కెట్లో లభిస్తాయి. వీటిలో అధిక శాతం నీరు ఉంటుంది. వేసవి కాలంలో శరీర చల్లదనానికి, శరీరంలో నీటిశాతాన్ని పెంచటానికి దోహదపడుతుంది. మంచి సువాసనతోపాటు ఈ పండు ఎంతో రుచిని కలిగి ఉంటుంది.
ఒక ఖర్భూజా ముక్కలో 53 క్యాలరీల శక్తి, 12 గ్రాముల పిండి పదార్ధాలు, ఒక గ్రాము మాంసకృత్తులు. ఒక గ్రాము పీచు, 23 మిల్లీ గ్రాముల సోడియం, విటమిన్ ఎ, బి6, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియమ్, విటమిన్ సి, కెరోటినాయిడ్స్ నియాపిన్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేయటంలో దీనిని మించింది లేదని చెప్పాలి. ఖర్బూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో తెల్ల రక్తకణాలు ఉత్తేజితమై రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది.
ఖర్జూజా తినటం వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చూసుకోవచ్చు. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ పై దాడి చేస్తాయి. చర్మాన్ని రక్షించటంలో ఉపయోగపడతాయి. ఖర్భూజాలో పీచు పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరంలోని వ్యర్ధాలు తేలికగా బయటకు నెట్టివేయబడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఖర్భూజాలో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగయ్యేందుకు ఉపకరిస్తుంది. శరీరంలో మ్యూకస్ పొరలను సరైన స్ధితిలో ఉంచేందుకు ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ దోహదపడతాయి. అధిక బరువుని తగ్గించటానికి ఇందులో ఉండే పీచుపదార్ధం పనికొస్తుంది.
ఖర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. ఖర్బూజ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్ని అందజేస్తుంది. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గర్భిణుల్లో బిడ్డ ఎదుగుదలకు ఖర్భూజా ఎంతో మేలు చేస్తుంది.
0 Comments:
Post a Comment