Medicines Price Hike: నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా(National Pharmaceutical Pricing Authority of India) శుక్రవారం 2020 క్యాలెండర్ సంవత్సరంతో పోల్చితే 2021కి టోకు ధరల సూచిక (WPI)ను 10.7 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.
దీని కారణంగా 800 షెడ్యూల్డ్ మెడిసిన్స్(Essential Medicines ) ధరలు పెరగనున్నాయి.
పెరిగిన సాధారణంగా వినియోగించే మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. దీని కారణంగా సామాన్యులపై రానున్న కాలంలో మరింత భారం పెరగనుంది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇచ్చిన టోకు ధరల సూచిక వివరాల ప్రకారం 2021 క్యాలెండర్ సంవత్సరంలో 10.76607 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది.
ఈ పెంపు కారణంగా జ్వరం, ఇన్ఫెక్షన్స్, హార్ట్ డిసీజెస్, హై బీపీ, చర్మ వ్యాధులు, అనీమియా వంచి వ్యాధుల చికిత్సకు వినియోగించే అనేక మందుల రేట్లు 10 శాతానికి పైగా పెరగుతాయి.
పారాసెట్మాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడాజోల్ మందుల ధరలు పెరుగుతున్నాయని నోటీసులో అధికారులు వెల్లడించారు.
మందుల ధరల పెంపుపై అధికారిక నోటీసు
0 Comments:
Post a Comment