42 మంది విద్యార్థులకు అస్వస్థత
➪ నంద్యాల:
☆ కర్నూలు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
☆ దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
☆ నంద్యాల పట్టణం విశ్వనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం మెనూలో పొంగలి, సాంబారు, కోడిగుడ్లను 91 మంది విద్యార్థులు తిన్నారు.
☆ కాసేపటికే విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు.
☆ దీంతో స్థానికులు 42 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
☆ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందించారు.
☆ ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
☆ పాఠశాలలోని ఇతర విద్యార్థులను కూడా పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.
☆ కోడిగుడ్లు మూడు వారాల క్రితం పాఠశాలకు సరఫరా అయ్యాయని, ఎండాకాలం కావడంతో లోపల పాడై ఉండవచ్చని భావిస్తున్నారు.
☆ పొంగలి, సాంబారు, కోడిగుడ్లను పరిశీలించేందుకు కర్నూలులోని ల్యాబ్‌కు పంపారు.
✍రెండు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్
♦83 మంది విద్యార్థులకు అస్వస్థత
♦హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. నిలకడగా అందరి ఆరోగ్యం
♦మెరుగైన వైద్యం అందించాలని సురేష్ ఆదేశం
*🌻రాప్తాడు రూరల్/అనంతపురం సప్తగిరి సర్కిల్/ నంద్యాల/సాక్షి, అమరావతి*: రాష్ట్రంలోని రెండు వేర్వేయ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీ ప్రాథమీకొన్నత పాఠశాలలో 42 మంది విద్యార్థులు కర్నూలు జిల్లా నంద్యాలలోని విశ్వనగర్ కాలనీలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో 41 మంది విద్యా ర్థులు అస్వస్థత పాలయ్యారు. పిల్లిగుండ్ల కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పొంగలి సాంబారు చేశారు. బోంచేస్తున్న సమయంలో తొలుత ముగ్గురికి వాంతులయ్యాయి. కొద్దిసేపటికే ఒకరి తర్వాత ఒకరుగా 42 మంది అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు 108కు సమాచారమిచ్చారు. ఐదు వాహనాలు వచ్చి విద్యార్థులను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించాయి. ఆస్పత్రిలో చికిత్స అందించారు. విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రిలో విద్యార్థులను ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ గిరజమ్మ, డీఈవో కె.శామ్యూల్ తదితరులు పరామర్మించారు. ఏజెన్సీ వ్యక్తులు పంట పండేటప్పుడు బియ్యం శుభ్రం చేయకపోవడంతో పురుగులు పడ్డాయని, తింటుండగా పురుగులు కనిపించడంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెచ్ఎం లక్ష్మీనరసింహను సస్పెండ్ చేసినట్లు డీఈవో కె.శామ్యూల్ వెల్లడించారు. ఘటనపై విచారణ చేపడుతున్నామన్నారు. సోమవారం నుంచి కొత్త ఏజెన్సీ ఆధ్వర్యంలో భోజనాన్ని అందిస్తామని చెప్పారు. మరోవైపు కర్నూలు జిల్లా నంద్యాలలోని విశ్వనగర్ కాలనీలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పొంగలి, సాంబారు, గుడ్డు వడ్డించారు. భోజనం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నా రు. 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యా రు. వారిని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నారు. నిల్వ ఉన్న గుడ్లను తిన్నందువల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
MDM తిన్న విద్యార్థులకు అస్వస్థత
హెచ్ఎం సస్పెన్షన్
అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీలోని MPUP స్కూల్లో ఈరోజు మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెచ్ఎం లక్ష్మీ నరసింహులు గారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గౌ.డీఈవో శామ్యూల్ గారు.*
0 Comments:
Post a Comment