Kalonji Seeds : కలోంజిని ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగకరమైన మూలికగా చెప్పవచ్చు. జీలకర్ర రకాల్లో ఇది ఒకటిగా చెప్తారు. చూడటానికి నల్ల నువ్వుల్లా కనిపిస్తాయి.
కలోంజి లో అనేక పోషకాలు , న్యూట్రిషన్లు, విటమీన్స్, ఫాట్ వంటివి ఉన్నాయి. అనేక వ్యాధుల నివారణలో చాలా ప్రయోజకరిగా చెప్పవచ్చు.
కలోంజి విత్తనాలలో ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఇనుము, సోడియం, కాల్షియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
అంతేకాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12, నియాసిన్, మరియు విటమిన్ సి. మొదలైన విటమిన్లు ఉంటాయి. ఈ కలోంజీ గింజలతో తయారుచేసే నూనె ప్రయోజకరంగా ఉంటుంది.
కడుపులో నులిపురుగులు నివారించటంలో కలోంజి గింజలు ఉపకరిస్తాయి. డయాబెటీస్ ను కంట్రోల్ చేయటంలో సైతం ఇవి బాగా పనిచేస్తాయి. కలోంజి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
కళ్ళలో నీరు కారడం , కళ్ళు తరచుగా ఎర్రబడటం వంటి అనేక సమస్యలు తొలగించటంలో దోహదం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి.
చిగుళ్ళ వాపులు, దంత సమస్యలను నివారించటానికి కలోంజిని ఆహారంలో చేర్చుకోవటం మంచిది. ప్రతిరోజు కలోంజిని తీసుకోవటం ద్వారా దంత సమస్యలు తొలగిపోతాయి.
డెలివరీ తర్వాత మహిళల శరీర బలహీనతను తొలగించడానికి కలోంజి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గలనుకునే వారు కలోంజిని తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మాన్ని నిగారింపు సంతరించుకునేలా చేయటంతోపాటు, మొటిమలు నివారించటంలో వీటి నుండి తయారైన తైలం బాగా ఉపయోగపడుతుంది.
కలోంజి విత్తనాలను పొడిగా చేసి తేనెతో కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు కోసం ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున దీన్ని తీసుకోవాలి.
ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఎదురయ్యే మతిమరుపు సమస్యకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కలోంజీ చాలా సహాయపడుతుంది. మధుమేహ రోగులు కలోంజి విత్తనాలతో బ్లాక్ టీ తయారుచేసుకుని తాగడం వల్ల మంచి పలితం ఉంటుంది.
ఆయుర్వేదంలో కీళ్ల సమస్యలకు కలోంజి నూనెను ఔషధంగా సూచిస్తారు. ఆస్తమాతో బాధపడేవారికి కలోంజీ శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది.
కలోంజీ నూనెను, తేనెను టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కలపి ప్రతిరోజు తాగితే ఉబ్బసం నుండి ఉపసమనం పొందవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు మరియు ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
0 Comments:
Post a Comment