Jobs: డైరెక్టరేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది.
భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
మొత్తం 33 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం.
సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, సివిల్ బ్రాంచ్ లలో పాసిన వాళ్లు టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 3 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 10 ఉండగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుండగా కనీసం 60 శాతం మార్కులు ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
20 ట్రేడులను టెక్నీషియన్ బి పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారు.
పది అర్హతతో పాటు సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.
ఆఫ్లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఆధారంగా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ ముంబై అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. http://dcsem.gov.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది
0 Comments:
Post a Comment