Jio Best Plans: జియో సంచలన ఆఫర్లు.. రూ.200 లోపు 4 అన్ లిమిటెడ్ ప్లాన్లు.. వివరాలివే
Jio Rs.149 Plan: ఈ ప్లాన్ రోజుకు 1GB డేటాను అందిస్తుంది. ఇంకా అన్ లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది.
ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 100 SMSలు లభిస్తాయి. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 20 రోజులు మాత్రమే.
Jio Rs.179 Plan: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1GB రోజువారీ డేటా అందిస్తోంది. ఇంకా అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తోంది. రోజుకు 100 SMSలు లభిస్తాయి. ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే.
Jio Rs. 119 Plan: ఈ ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ మరియు మొత్తం 300 SMSలను అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 14 రోజుల వాలిడిటీని మాత్రమే కలిగి ఉంది.
Jio Rs 199 Plan: మీకు ఎక్కువ డేటా అవసరం అయితే రూ.199 ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ 1.5GB డైలీ డేటాను అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100SMS లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు మాత్రమే. చెల్లుబాటు తక్కువగా ఉన్నప్పటికీ, ఇది మీకు ఎక్కువ డేటాను అందిస్తుంది.
Jio Rs. 209 Plan: మీకు ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లు కావాలంటే ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 1GB డైలీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తోంది. ఇంకా డైలీ 100 SMSలు లభిస్తాయి. ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.
0 Comments:
Post a Comment