విమాన ప్రయాణాలకు సంబంధించి గుడ్ న్యూస్ వెలువడింది. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల (international passenger flights)పై ఉన్న నిషేధాన్ని భారత్ ఎత్తివేయనుంది.
మార్చి 27 నుంచి ఇంటర్నేషనల్ ప్యాసింజర్ సర్వీసులు పున:ప్రారంభం కానున్నాయని పౌర విమానయాన శాఖ (Civil Aviation Ministry) మంగళవారం ప్రకటించింది.
కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు అంతర్జాతీయ విమానాలు నిలిచిపోవడం తెలిసిందే.
విమానయాన రంగం దాదాపు కుదేలైన పరిస్థితి, కొవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ నెల 27 నుంచే రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లయిట్ ఆపరేషన్స్‌ను కొనసాగించవచ్చని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ పెరగిన క్రమంలో సంబంధిత భాగస్వాములతో సంప్రదింపుల తర్వాత సర్వీసులపై నిషేధాన్ని మార్చి 26న ముగించాలనే నిర్ణయానికి వచ్చామని, (2022)మార్చి 27 నుంచి భారత్ కు వచ్చే, భారత్ నుంచి వెళ్లే అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సర్వీసులను పున:ప్రారంభించేందుకు నిర్ణయించనైనదంటూ పౌర విమానయాన శాఖ ప్రకటనలో పేర్కొంది.
పౌర విమానయాన శాఖ సర్క్యులర్
రెండేళ్ల కిందట కొవిడ్ విలయం, గతేడాది ఒమిక్రాన్ విజృంభణ కారణంగా భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి.
అయితే, అత్యవసర సేవల నిమిత్తం వివిధ దేశాలతో చేసుకున్న ఎయిర్ బబూల్ ఒప్పందాల మేరకే ఈ రెండేళ్లపాటు కొద్ది సంఖ్యలోనే విమానాలు తిరిగాయి.
కరోనా తర్వాతి కాలంలో రెగ్యులర్ కమర్షియల్ ఇంటర్నేషనల్ ప్యాసెంజర్ విమానాలపై నిషేధం కొనసాగింది.
చివరిసారిగా ఫిబ్రవరి 28న కూడా నిషేధాన్ని పొడిగించిన కేంద్రం.. ఇవాళ్టి ప్రకటనతో నిషేధం ఎత్తివేత ముహుర్తాన్ని ఖరారు చేసింది.
ఆఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బహ్రయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవూస్, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజేరియా, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంక, స్విట్జర్లాండ్, తంజానియా, ఉక్రెయిన్, యూఏఈ, యూaviatకే, ఫ్రాన్స్ దేశాలతో ఎయిర్ ట్రాన్స్‌పోర్టు బబుల్ అగ్రిమెంట్‌ను భారత్ కుదుర్చుకుంది. ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్న తరుణంలో విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త చెబుతూ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ఆమోదం తెలిపింది.
0 Comments:
Post a Comment