House Warming Ceremony: మనలో చాలామందికి సొంతింటిలో ఉండాలనేది ఒక కల. అలాంటి కలను కొంతమంది కష్టపడి పని చేసి, సొంతంగా ఒక ఇంటిని నిర్మించుకుంటారు
అలాంటి ఇంటిలోకి ప్రవేశించే సమయంలో హిందూ సంప్రదాయం, ఆనవాయితీ ప్రకారం పాలను పొంగిస్తారు. అయితే ఏదో ఆనవాయితీ, పెద్దలు చెబుతారు కానీ మనలో చాలామంది పాలను పొంగించి కొత్త ఇంట్లోకి అడుగు పెడతారు.
నిజానికి ఇలా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఎందుకు పాలను పొంగిస్తారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
హిందూ సంప్రదాయంలో ఒక పని లేదంటే ఒక ఆచారం ఉందంటే దాని వెనక ఎంతో అర్థం, పరమార్థం ఉంటుంది. పెద్దలు ఎంతో ఆలోచించి అలాంటి ఆచారాలను, కట్టుబాట్లను చేసి ఉంటారు. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో పాలు పొంగించడంలోనూ ఎంతో ఆంతర్యం ఉంది. అదేంటంటే..
కొత్త ఇంట్లో ప్రవేశించే సమయంలో పాలను పొంగించడం ద్వారా ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలనే ఉద్దేశంతో ఆ ఇంటి ఆడబిడ్డ చేత పాలు పొంగిస్తారు. అదే పాలతో చక్కెర పొంగలి తయారు చేయించి, దానిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
House Warming Ceremony
అలాగే హిందూ సంప్రదాయంలో సకల దేవతా రూపంగా భావించే గోవును కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. గోవు ఇంట్లో అడుగు పెట్టడం వల్ల సకల దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారనే నమ్మకం హిందూ ఆచారంలో ఉంది.
అందుకే కొత్తగా ఇంట్లోకి ప్రవేశించే సమయంలో పాలు పొంగించి, గోవును ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు.
0 Comments:
Post a Comment