భారతీయులు నెయ్యిని ఎక్కువగా వాడతారు. రుచికరమైన స్వీట్ల నుంచి ఘుమఘుమలాడే బిర్యానీ వరకు.. చాలా వంటకాల్లో నెయ్యిని వినియోగిస్తారు. ఐతే నెయ్యిని తింటే బరువు పెరుగుతారని చాలా మంది భయపడతారు.
అందుకే నెయ్యి వైపు కన్నెత్తి చూడరు. నెయ్యి లేని పదార్థాలనే తింటుంటారు. కానీ ఇది అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకోవడం కరెక్టు కాదని.. ఏదైనా సరే పరిమిత పరిమాణంలో తింటేనే మంచిదని అంటున్నారు.
నెయ్యిని కూడా పరిమితంగా తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రముఖ పోషకాహార నిపుణుడు అవంతి దేశ్పాండే తన ఇన్స్టగ్రామ్ ఖాతా ద్వారా నెయ్యి ప్రయోజనాల గురించి వివరించారు.
ఉదయాన్న పరగడుపున చెంచా నెయ్యి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్పారు. ఆవివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
నెయ్యి వెన్న యొక్క స్పష్టమైన రూపం. ఆయుర్వేదం ప్రకారం ఇది చిన్న ప్రేగు యొక్క శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నెయ్యి ప్రేగులలోని ఆమ్ల pH స్థాయిని తగ్గిస్తుంది. ఉదయాన్ని ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి.
మీరు ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే.. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కలిగే సమస్యలు తగ్గుతాయి.
నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రోజంతా కూర్చునే అలవాటు, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వంటి అనేక కారణాల వల్ల ఉదర ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాంటప్పుడు నెయ్యి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఉదయాన్నే పరగడపును నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఒకవేళ మీకు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే.. మీరు తప్పనిసరిగా ఉదయం పూటా నెయ్యి తీసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా చెంచాడు నెయ్యిని తినాలి.
నెయ్యి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖం అందంగా కనిపిస్తుంది. ముడతలు తగ్గి వయసు తగ్గినట్లుగా మారిపోతారు.
ప్రేగుల్లో కదలికను మెరుగుపరచడానికి నెయ్యి తినవచ్చు. మలబద్ధకం ఉన్నవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినాలి. అప్పుడు పేగుల్లో కదలిక ఏర్పడి సుఖ విరేచనం అవుతుంది.
నెయ్యి తినడం ద్వారా చాలా సమయం పాటు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
దీని కారణంగా మీరు అతిగా తినకుండా ఉంటారు. తద్వారా బరువు పెరగదు. నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు వంటి సమస్యలు రావు.
నెయ్యి ఎముకల దృఢత్వాన్ని, బలాన్ని, శక్తిని పెంచుతుంది. ఆవశ్యకమైన, ఆరోగ్యకరమైన ఎంజైమ్లు ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అందుకే ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత.. పరగడుపున నెయ్యి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి.
0 Comments:
Post a Comment