Health Tips: పుచ్చకాయ గింజలను పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే వాటిని అస్సలు పడేయరు..!
Health Tips: వేసవి కాలం వస్తే చాలు శరీరాన్ని ఎండ వేడిమి నుండి కాపాడుకోవడానికి అనేక రకాల మార్గాలు వెతుక్కుంటారు. ముఖ్యంగా వేసవి లో ఎక్కడ చూసినా విపరీతంగా పుచ్చకాయలు లభిస్తాయి.
వీటిలో అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది, ఫలితంగా ఎండ వేడిమి నుండి ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు, పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు పుచ్చకాయలను అధికంగా తినడం వల్ల ఫలితం లభిస్తుంది. పుచ్చకాయ లో లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది ఇది పురుషులలో వీర్య కణాలను వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా పుచ్చకాయ గుజ్జు ని తిని అందులో ఉన్న విత్తనాలను పడేస్తుంటారు. అయితే గింజలలో కూడా అనేకమైన పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఒక కప్పు పుచ్చకాయ గింజలు తింటే 600 కేలరీల శక్తి లభిస్తుందని నిపుణులు తెలిపారు. పుచ్చకాయల గింజలలో విటమిన్లు, జింక్, కాపర్, పొటాషియం ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటి ఆమ్లాలు, ప్రోటీన్లు మెగ్నీషియం అధిక మొత్తంలో లభిస్తాయి. వీటిని తినటం వల్ల విటమిన్ బి పుష్కలంగా శరీరానికి అందుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. పుచ్చకాయ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకోండి.
• రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలోని చక్కెర స్థాయిని నివారించడానికి, ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉండడానికి పుచ్చకాయ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. డయాబెటిక్ రోగులకు పుచ్చకాయ గింజలు ఎంతో మేలు చేకూరుస్తాయి.
• బోలులు ఎముకల వ్యాధిని నివారించవచ్చు
బలహీనమైన, తక్కువ ఎముకల సాంద్రత కలిగి ఉండటాన్ని బోలు ఎముకల వ్యాధి అని అంటారు. పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ ఎముకల సాంద్రతను, బలాన్ని పెంచుకోవచ్చు. పుచ్చకాయ గింజలలో మెగ్నీషియం, పొటాషియం, రాగి, మాంగనీస్ పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
• పుచ్చకాయ గింజల లో కేలరీలు అధికంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ మెండుగా పనిచేస్తుంది. మీ కండరాల పనితీరు కి అవసరమైన కేలరీలు వీటిలో లభిస్తాయి. అయితే ఈ గింజలను అధికంగా తినటం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉంది, తగిన మోతాదులో తీసుకోవడం అవసరం.
0 Comments:
Post a Comment