Health Tips: సాధారణంగా అందరూ సముద్రం నుండి లభ్యమయ్యే తెల్లగా ఉన్న ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు.
కానీ ఈ తెల్లటి ఉప్పు కన్నా నల్ల ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
హిమాలయాలలోని గనుల నుండి తవ్వి తీసిన ఈ నల్ల ఉప్పును హిమాలయన్ రాక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. నల్ల ఉప్పును ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు.
ప్రస్తుత కాలంలో అనేక రకాల టూత్ పేస్ట్ తయారీలో కూడా ఈ బ్లాక్ సాల్ట్ ఉపయోగిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో నల్ల ఉప్పు చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నల్ల ఉప్పులో క్యాల్షియం,మెగ్నీషియం, పొటాషియం వంటి ఇతర మూలకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా మనం ఎప్పుడూ ఉపయోగించే తెల్ల ఉప్పు తో పోల్చుకుంటే ఈ నల్ల ఉప్పు లో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం తీసుకునే ఆహారంలో ఉప్పు చేర్చడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
నల్ల ఉప్పు ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల జిల్లా క్రియ సక్రమంగా జరిగే జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా చేస్తుంది.
అజీర్తి వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు చిటికెడు నల్ల ఉప్పును నీళ్ళల్లో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే కాలేయంలో పైత్యరసం ఉత్పత్తిని పెంచి గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు కూడా ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి తాగడం వల్ల వారు సమస్య తగ్గుముఖం పడుతుంది.
నల్ల ఉప్పు ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. షుగర్ వ్యాధి నివారణలో కూడా నల్ల ఉప్పు ఎంతో ఉపయోగపడుతుంది.
0 Comments:
Post a Comment