ఒంటిపూట బడులు లేనట్టేనా..?
అమరావతి మార్చి 25: పాఠశాల విద్య ఉన్నతాధికారులు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఒంటిపూట బడుల ప్రస్తావన రాగా ఆసక్తి కర చర్చ జరిగింది. మధ్యాహ్నం వరకు పాఠశాలలు నిర్వ హించి తీవ్ర ఎండ వేడిమిలో ఒంటిపూట బడుల పేరుతో పిల్లలను ఇళ్లకు పంపడం ఎంతవరకు సబబు అంటూ పలువురు విద్యాధికారులు అభిప్రాయం తెలిపారు. సా యంత్రం 4 గంటల తర్వాత ఉష్ణోగ్రత తీవ్రత తగ్గు తుంది గనుక ఇప్పుడున్న మాదిరిగానే రెండు పూటలా బడులు నిర్వహించడం శ్రేయస్కరమనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వ విధానం ప్రకారం ఏటా మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఒంటిపూట బడులు నిర్వహించ డం ఆనవాయితీగా వస్తోందని కొందరు ప్రస్తావించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో కొవిడ్ కారణం గా రెండు నెలలపాటు పాఠశాలలు తెరవడం సాధ్యంకా నందున ఆ మేరకు ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ఇప్పటికే సిలబసను తగ్గించగా, తాజాగా ఒంటిపూట బడులను ఈ ఏడాదికి ఎత్తి వేయాలని సూచనలు వచ్చి నట్టు తెలిసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులను అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతా లు వచ్చినా, అధికారిక నిర్ణయమేదీ వెలువడలేదు.
0 Comments:
Post a Comment