Guava Leaves: మారుతున్న జీవన శైలి కారణంగా..
ఈ రోజుల్లో చాలాంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు ఒక్కటి.. విపరీతంగా జుట్టు రాలుతూ ఉండడం.. లేదా త్వరగా తెల్లవెంట్రుకలు రావడం.. వీటితో పాటు చుండ్రు సమస్యల అది కాదంటే బట్టతల ప్రాబ్లమ్.. ఇలా చాలామంది జట్టు విషయంలో పలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వీటన్నింటికీ సరైన పరిష్కారం జామ ఆకుల్లో ఉంది అంటున్నారు నిపుణులు.
సాధారణంగా అధిక పోషకాలు కలిగిన పండ్ల జాతుల్లో జామ చాలా ముఖ్యమైనది.. అన్నిటికంటే.. సామాన్యుడి పండుగా జామపండుకు మంచి గుర్తింపు ఉంది.
జామపండ్లలాగానే జామ ఆకుల్లో కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఆకుల్లో విటమిన్ బి,సి ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ పెంచటంలో సహాయపడతాయి.
జామచెట్టు లేత ఆకుల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ B6 మూలాన్ని కలిగి ఉన్న జామ ఆకులు, సెల్యులార్ జీవక్రియకు అవసరమైన పెద్ద సంఖ్యలో అవసరమైన ఎంజైమ్‌లను రూపొందించడంలో సహాయపడతాయి.
జుట్టుతోపాటు సెల్యులార్ డెవలప్మెంట్, శరీరం పరిరక్షణ ప్రక్రియకు సహాయపడతాయి.
జామ ఆకుల్లో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఇది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ను చాలా త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఒకటి.. అలాగే జామ ఆకు జుట్టు రాలే సమస్యలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.
జుట్టు రాలడానికి ప్రధాన కారణం రక్తహీనతే.. అందులోనూ మహిళలు ఎక్కువశాతం రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతో సహాయ పడుతాయి.
జామ ఆకులను టీగా తీసుకుంటే.. రక్తహీనత తొలగించటంలో సహాయపడుతుంది. జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి టీగా తీసుకోవటం చాలామంచిది అంటున్నారు.
జామ ఆకులలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. జుట్టు రాలడానికి దారితీసే దురద, చుండ్రు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో ఉపయోగపడతాయి.
మాడు మీద దురద చుండ్రు వంటి సమస్యల చికిత్సలో ఇవి బాగా ఉపయోగపడతాయి. జామ ఆకులు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
జామ ఆకులను హెయిర్ ప్యాక్‌గా ఉపయోగిస్తే.. జామ టీ రూపంలో తీసుకోవడం కారణంగా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అయిన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణం అయిన ఫ్రీ రాడికల్స్‌ను కూడా తొలగిస్తాయి. చర్మం రాలటం తగ్గి, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
కులే కాదు జామపండు తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. ఎందుకంటే జామ కూడా ఆమ్ల స్వభావం కలిగిన పండు.
అందువల్ల, జామపండు తినడం ద్వారా, గ్యాస్ విడుదల చేయడం సులభం మరియు వాత సమతుల్యతలో ఉంటుంది.
0 Comments:
Post a Comment